ధనత్రయోదశి పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. ముఖ్యంగా ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం కలిసివస్తుందని, సంపద వృద్ధి చెందుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ ధనత్రయోదశికి పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి అటు మార్కెట్లోని పలు దిగ్గజ కంపెనీలు పలు ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ధనత్రయోదశి రోజు కనీసం ఒక్క గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా అటు ఆభరణాలు కొనేవారు కరువయ్యారు. దీంతో బంగారం సేల్స్ భారీగా పడిపోయాయి. అయితే అన్ లాక్ లో భాగంగా ఆభరణాల దుకాణాలు తెరవడంతో ఈ సారి ఎలాగైనా మంచి సేల్స్ సాధించాలని బంగారం దుకాణాలు పలు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వచ్చాయి.
మలబార్ వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ (Malabar gold one india one Gold rate)
ప్రముఖ ఆభరణాల రిటైల్ విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తాజాగా వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం దేశ మంతా మలబార్ గోల్డ్ షాపుల్లో ఒకే రేటు అమలవుతోంది. ఇందులో 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ బంగారాన్ని అన్ని రాష్ట్రాల్లోని సంస్థ షోరూముల్లోనూ ఒకే రేటుకు ఆఫర్ చేయనుంది. అంతేకాదు, బంగారం ఎక్స్ఛేంజ్‌పై సున్నా శాతం తరుగు, బైబ్యాక్ సందర్భంలో నగలకు అత్యుత్తమ విలువ అందించనున్నట్లు మలబార్ వెల్లడించింది. నిజానికి బంగారం ధరలు ఒక్కో సిటీలో ఒక్కో రేటు పలుకుతుంటాయి. అయితే మలబార్ ప్రకటించిన ఈ ఆఫర్ కింద అతి తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసేవీలుంది.
తనిష్క్ ప్రీ బుకింగ్, సెక్యూర్ గోల్డ్ రేట్ (Tanishq secure gold rate)
ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా టాటా గ్రూప్ కంపెనీ తనిష్క్ ప్రీ బుకింగ్ అండ్ సెక్యూర్ గోల్డ్ రేట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఎంపిక చేసుకున్న ఆభరణం విలువలో 25 శాతం అడ్వాన్సుగా చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తద్వారా అడ్వాన్సు చెల్లించిన తేదీ నుంచి బిల్లింగ్ తేదీ మధ్యలో నమోదయ్యే తక్కువ రేటుకు బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది సంస్థ. తద్వారా మార్కెట్లోని అతి తక్కువ ధరకు మీరు బంగారం కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది.
అమెజాన్ ధన్‌తేరస్ స్టోర్ (Amazon Dhanteras Store)
ఆ ధన త్రయోదశని పురస్కరించుకొని అమెజాన్ ధన్‌తేరస్ స్టోర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గోల్డ్ గిఫ్ట్ ఓచర్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఓచర్ల కనీస విలువ రూ.500. గరిష్ఠ విలువ రూ.10,000. ఇతర గిఫ్ట్ కార్డులాంటివే ఈ ఓచర్లు. వీటితో తనిష్క్, కల్యాణ్ జువెలర్స్, పీసీ జువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ ఆభరణాల స్టోర్ల నుంచి బంగారం, వజ్రాభరణాలు, గోల్డ్ కాయిన్స్, బార్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఓచర్ల కాలపరిమితి 6-12 నెలల వరకు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.