ధంతేరాస్ రోజున బంగారం కొనేందుకు మహిళలు, పసిడిప్రేమికులు సిద్ధమవుతున్నారు. ఆఫర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోవడానికి నగల షాపులు రెడీగా ఉన్నాయి. మరి మీరు కూడా ధంతేరాస్ (Dhanteras 2022) రోజున గోల్డ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం స్టోర్ చేసుకోవచ్చో తెలుసా? మన డబ్బులు పెట్టి కొనే బంగారమే అయినా ఇంట్లో స్టోరేజ్‌కు లిమిట్ (Gold Storage Limit) విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలి. కొంత లిమిట్ వరకు బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు లేకపోయినా పర్వాలేదు. కానీ ఆ లిమిట్ కన్నా ఎక్కువ బంగారం ఉంటే, అందుకు సంబంధించిన లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు మహిళలకు, పురుషులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి.
గోల్డ్ కంట్రోల్ యాక్ట్ 1968 ప్రకారం పౌరులు లిమిట్ కన్నా ఎక్కువ బంగారాన్ని ఇంట్లో దాచుకోకూడదు. అయితే 1990 జూన్‌లో ఈ రూల్‌ను తొలగించారు. ప్రస్తుతం ఇంట్లో బంగారాన్ని స్టోర్ చేసుకునే విషయంలో ఎలాంటి లిమిట్ లేదు. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) 1994 లో జారీ చేసిన సర్క్యులర్‌లో ఒక వ్యక్తికి ఎంత నగలు ఉండాలని స్పష్టంగా ఉంది. పురుషులకు, మహిళలకు, పెళ్లి చేసుకున్నవారికి ఈ లిమిట్ వేర్వేరుగా ఉంటుంది.
No-Cost EMI: నో- కాస్ట్ ఈఎంఐలో ఫోన్, టీవీ కొంటున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి
పెళ్లైన మహిళలు 500 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చు. పెళ్లికాని మహిళలకు ఈ లిమిట్ 250 గ్రాములు మాత్రమే. ఇక పురుషులకు ఈ లిమిట్ 100 గ్రాములుగా ఉంది. ఉదాహరణకు ఓ కుటుంబంలో తల్లిదండ్రులు, వారి పెళ్లైన కొడుకు, కోడలు, పెళ్లికాని మరో కొడుకు ఉన్నారనుకుందాం. వారి ఇంట్లో 1300 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఇందులోనే కొన్న బంగారంతో పాటు వారసత్వంగా వచ్చిన బంగారం కలిపే లెక్కిస్తారు.
ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపితే పైన చెప్పిన లిమిట్ వరకు బంగారాన్ని సీజ్ చేయరు. కానీ అంతకన్నా ఎక్కువ బంగారం ఇంట్లో ఉంటే, ఆ నగలకు సంబంధించిన లెక్కలు చూపించకపోయినా, సంబంధిత పత్రాలు, బిల్లులు లేకపోయినా సీజ్ చేస్తారు. అందుకే బంగారం కొనేప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. వాటిని భద్రపర్చాలి. బంగారం ఎలా వచ్చిందో చెప్పగలిగితే మీకు ఎలాంటి చిక్కులు ఉండవు. 2016లో సీబీడీటీ సర్క్యులర్ ప్రకారం, మీ ఇంట్లో ఉన్న బంగారం వారసత్వంగా ఎలా వచ్చిందో, ఎక్కడ కొన్నారో నిరూపించగలిగితే ఇంట్లో ఎంతైనా బంగారం ఉండొచ్చు.
Tax on Diwali Gifts: దీపావళికి బోనస్ వచ్చిందా? గిఫ్ట్ తీసుకున్నారా? ట్యాక్స్ చెల్లించాలి
అయితే, మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో మీరు కలిగి ఉన్న బంగారం మొత్తాన్ని వెల్లడించాలి. లేకపోతే అసెస్సింగ్ అధికారికి బంగారాన్ని జప్తు చేసే అధికారం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras, Dhanteras 2022, Gold jewellery, Gold Prices, Personal Finance