హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digital Gold: ధన త్రయోదశికి డిజిటల్‌ గోల్డ్‌ కొంటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

Digital Gold: ధన త్రయోదశికి డిజిటల్‌ గోల్డ్‌ కొంటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dhanteras: డిజిటల్ గోల్డ్‌ను ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm) తదితర ప్లాట్‌ఫారమ్‌లలో కొనవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో బంగారం కొనవచ్చా? డిజిటల్ గోల్డ్ ఎంత వరకు సురక్షితం అనే విషయాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Digital Gold:  ఇండియాలో ఎక్కువ మంది బంగారం కొనడానికి ఇష్టపడతారు. అలంకరణ కోసమే కాకుండా బంగారాన్ని (Gold) ఒక సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్‌గా భావిస్తారు. ఈ ఏడాది ధన్‌తేరస్‌ (ధన త్రయోదశి) పండుగ అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ధన్‌తేరస్ (Dhanteras) బంగారం కొనుగోలు చేయడాన్ని భారత ప్రజలు శుభంగా భావిస్తారు. ఇప్పుడు ఫిజికల్‌ గోల్డ్‌ మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోనూ బంగారం కొనవచ్చు. అటువంటి ఆప్షన్లలో ఒకటి డిజిటల్ గోల్డ్‌ (Digital Gold). దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, ఇందుకు సమానమైన ఫిజికల్ గోల్డ్‌ పొందవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm) తదితర ప్లాట్‌ఫారమ్‌లలో కొనవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో బంగారం కొనవచ్చా? డిజిటల్ గోల్డ్ ఎంత వరకు సురక్షితం అనే విషయాలు తెలుసుకుందాం.

Diwali-Gold: గతేడాది బంగారం కొన్న వారికి లాభం.. కానీ వెండి మాత్రం అలా

* కొంచెం రిస్క్‌

ఆన్‌లైన్‌ గోల్డ్‌ విక్రయించేందుకు వివిధ సంస్థలు దేశంలోని MMTC-Pamp, Augmont, SafeGold వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన బంగారు రిఫైనర్లతో పని చేస్తాయి. డిజిటల్ గోల్డ్‌ అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్‌ అని, కానీ కొంత రిస్క్, షరతులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* ఛార్జీలు, స్వచ్ఛత

చాలా ప్లాట్‌ఫారమ్‌లు డిజిటల్ గోల్డ్‌ కోసం 2 నుంచి 3 శాతం ఫీజు వసూలు చేస్తాయి. ఎందుకంటే ఇవి బ్యాంక్/క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఛార్జీలను కవర్ చేస్తుంది. డిజిటల్ గోల్డ్‌పై కూడా 3 శాతం జీఎస్టీ విధిస్తారు. తమ బంగారాన్ని తిరిగి విక్రయించినప్పుడు కస్టమర్‌లు GST తిరిగి పొందలేరు. చాలా ప్లాట్‌ఫారమ్‌లు స్వచ్ఛతను నిర్ధారించడానికి ఇండివిడ్యువల్‌ సెర్టిఫైడ్‌ 24KT, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తాయి. వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌ కొనుగోలు చేసే ముందు బంగారం నాణ్యతను నిర్ధారించుకోవాలి.

Gold Price Today: ధంతేరాస్‌కు 3 రోజుల ముందు శుభవార్త... తగ్గిన గోల్డ్ రేట్

* ఎంతైనా కొనే అవకాశం ఉందా?

డిజిటల్ గోల్డ్‌ కొనుగోలుపై ఎటువంటి పరిమితి లేదు. పెట్టుబడిదారులు దానిని కేవలం రూ.1కి కూడా కొనుగోలు చేయవచ్చు. గరిష్ట పరిమితి కూడా లేదు. డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.1.5- రూ.2 లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్ల కోసం KYC వివరాలను కోరవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్ గోల్డ్‌ పరిశ్రమకు రెగ్యులేటరీ అథారిటీ లేదు. ఇప్పటివరకు స్టాక్ బ్రోకర్లు డిజిటల్ బంగారాన్ని విక్రయించకుండా సెబి మాత్రమే పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోంది.

* ఫిజికల్ గోల్డ్‌గా ఎలా మార్చాలి?

MMTC-Pamp, Augmont, SafeGoldతో పనిచేసే ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిజిటల్ గోల్డ్‌ కొంటే, బంగారం డిజిటల్ వాల్ట్‌లో స్టోర్‌ అవుతుంది. నామమాత్రపు ఛార్జీలను చెల్లించడం ద్వారా ఎప్పుడైనా ఫిజికల్ గోల్డ్‌ పొందవచ్చు. అయితే సొంత ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్న ఆభరణాల విషయంలో ఎక్కడ భద్రపరుస్తారో తెలియదు. దిగుమతి సుంకాన్ని ఆదా చేసేందుకు విదేశాల్లోని వాల్ట్‌లలో బంగారాన్ని ఉంచుతారని కొందరు నగల వ్యాపారులు పేర్కొంటున్నారు.

First published:

Tags: Dhanteras, Dhanteras 2022, Dhanteras gold, Gold

ఉత్తమ కథలు