Gold Investment | ధంతేరాస్ వచ్చేసింది. చాలా మంది ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. బంగారం (Gold) కొంటే శుభప్రదమని అనుకుంటారు. అందువల్ల మీరు కూడా ధంతేరాస్ రోజున బంగారం కొనాలని చూస్తే.. మీకోసం ఒక బెస్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. బంగారం కొనుగోలుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నేరుగా జువెలరీ (Gold Jewellery) షాపుకు వెళ్లి కొనొచ్చు. లేదంటే ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ (Digital Gold) కొనే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.
జువెలరీ షాపుకు వెళ్లి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కన్నా గోల్డ్ ఈటీఎఫ్‌లో డబ్బులు పెట్టడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు అనేవి మ్యూచువల్ ఫండ్ యూనిట్ల మాదిరే ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి. డీమ్యాట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్ రూపంలో స్టోర్ అవుతాయి. విక్రయించి డబ్బులు పొందొచ్చు. పోర్ట్‌ఫోలియో అలొకేషన్ పరంగా చూసినా కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ఎస్బీఐ సర్ప్రైజ్.. దీపావళి ముందు కస్టమర్లకు అదిరే శుభవార్త!
గోల్డ్ ఈటీఎఫ్‌ల వల్ల బంగారాన్ని స్టోర్ చేయాలనే తిప్పలు ఉండవు. లాక్ వంటి వాటితో పని లేదు. సేఫ్‌గా డీమ్యాట్ ఖాతాలోనే ఉంటాయి. స్వచ్చత విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. గోల్డ్ ఈటీఎఫ్‌లు కొంటే తయారీ చార్జీలు వంటివి ఉండవు. ఎలక్ట్రానిక్ రూపంలో కొంటున్నాం కాబట్టి చార్జీల నుంచి తప్పించుకోవచ్చు. బంగారం ధరకు సంబంధించి పారదర్శకత ఉంటుంది.
రూ.లక్ష పెట్టుబడితో రూ.14 లక్షల లాభం.. 29 పైసల షేరుతో డబ్బే డబ్బు!
అంతేకాకుండా జువెలరీ షాపుకు వెళ్లి బంగారు ఆభరణాలు కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే రూ.45 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధర రూ. 45గా (అక్టోబర్ 20న) ఉంది. అంటే మీకు రూ.45కు ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ వస్తుంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అనువైన మార్గం అని చెప్పుకోవచ్చు.
ఇంకా గోల్డ్ ఈటీఎఫ్‌లను తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో డబ్బులు పెట్టి మూడేళ్ల దాటితే అప్పుడు ఆ గోల్డ్ ఈటీఎఫ్‌పై అర్జించిన ఆదాయాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌ను పరిగణిస్తారు. అంటే పన్న ఆదా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎప్పుడు డబ్బులు అవసరం అయితే అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌లను సులభంగానే విక్రయించొచ్చు. అందువల్ల లిక్విడిటీ సమస్యలు కూడా ఉండవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold ornmanets, Gold Price Today, Gold Rate Today