Amazon India: అమెజాన్ ఇండియాకు డీజీజీఐ నోటీసు

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులోని అమెజాన్‌ ఇండియా కార్యాలయానికి నోటీసు పంపిన డీజీజీఐ అధికారులు.. వారు పంపే సమాధానం ఆధారంగా వారిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

  • Share this:
    ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నోటీసు జారీ చేసింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) యొక్క తప్పుడు దావాపై కంపెనీ ఆరోపణలు చేసింది. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం జీఎస్టీ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ రూ.175 కోట్లు డిమాండ్ చేసింది. బెంగళూరులోని అమెజాన్‌ ఇండియా కార్యాలయానికి నోటీసు పంపిన డీజీజీఐ అధికారులు.. వారు పంపే సమాధానం ఆధారంగా వారిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
    నోటీసులో పొందుపరచిన వివరాల మేరకు డీజీజీఐ దర్యాప్తులో అమెజాన్ ఇండియా చేసిన లెక్కల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. సంస్థ మొదట జీఎస్టీ చెల్లించిందని, తరువాత వాపసును తప్పుగా క్లెయిమ్ చేయడం ప్రారంభించిందని నోటీసులో పేర్కొన్నారు. అమెజాన్ ఇండియాకు పంపిన నోటీసులో అసలు బకాయిల గురించి డీజీజీఐ అడిగారు. పన్ను లీకేజీలను అరికట్టడానికి జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం దేశవ్యాప్తంగా డ్రైవ్ ప్రారంభించింది.

    మరోవైపు అమెజాన్ సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఆఫర్లను అందిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ‘పొంగల్ షాపింగ్ స్టోర్’ (Pongal shopping store) పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. దీంట్లో భాగంగా ఎలక్ట్రానిక్స్, పెద్ద ఉపకరణాలు (large appliances), స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలు (accessories), అమెజాన్ డివైజ్‌లు.. వంటి ఎన్నో ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పుడు కస్టమర్లు వివిధ రకాల ఉత్పత్తులను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. పండుగ సందర్భంగా కొత్త ప్రొడక్ట్స్‌ను కొనాలనుకునే వారికోసమే ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని అమెజాన్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

    (Source: SuryaaPaper)
    First published: