హోమ్ /వార్తలు /బిజినెస్ /

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ అదిరే శుభవార్త! రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, పెన్షన్‌పై కీలక ప్రకటన!

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ అదిరే శుభవార్త! రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, పెన్షన్‌పై కీలక ప్రకటన!

నిర్మలా సీతారామన్ అదిరిపోయే శుభవార్త! రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, స్కీమ్స్‌పై కీలక ప్రకటన

నిర్మలా సీతారామన్ అదిరిపోయే శుభవార్త! రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, స్కీమ్స్‌పై కీలక ప్రకటన

Mudra Loan | నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పలు అంశాలపై ఫోకస్ చేయనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  loan | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుభవార్త అందించారు. దేశంలో మరింత ఆర్థిక సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకేసారి దీన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు ప్రాంతాలను ఈ కార్యక్రమం అమలు కోసం ఎంపిక చేసింది. ఇందులో ఏపీ (AP) నుంచి ఒక ప్రాంతం ఉంది. అయితే తెలంగాణ మాత్రం లేదు.

  నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించారు. కటక్ (ఒడిశా), ఔరంగాబాద్ (మహరాష్ట్ర), పుణే (మహరాష్ట్ర), కాకినాడ (ఆంధ్రప్రదేశ్), కౌశాంబి (యూపీ), దాటియా (మధ్యప్రదేశ్), బర్పేటా (అస్సాం) ప్రాంతాల్లో తొలిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. 2022 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 26 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది.

  బ్యాంకుల చౌక బేరం.. ఈ కార్లు కొనేందుకు అతితక్కువ వడ్డీ రుణాలు!

  దేశంలోని ఎంపిక చేసిన ఏడు జిల్లాల్లో గ్రామ పంచాయితీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ స్పెషల్ కార్యక్రమం ఐదు అంశాలు లక్ష్యంగా జరగబోతోంది. బ్యాంక్ అకౌంట్లు, ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్స్‌ను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తారు. అలాగే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో), స్వయం సహాయక గ్రూప్‌లకు కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు సంబంధించి రుణాలు మంజూరు చేస్తారు.

  హమ్మయ్యా.. బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. పడిపోయిన ధరలు!

  ముద్రా లోన్స్‌ను మరింత మందికి అందేలా చూడనున్నారు. అలాగే పశుపోషణ, పాడి పరిశ్రమ, చేపల పెంపకంలో ఉన్న వారికి కూడా ముద్రా పథకం ప్రయోజనాలను అందించనున్నారు. స్వయం సహాయక గ్రూపు సభ్యులను దేశంలోని ఆర్థిక సమ్మిళిత వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇంకా పూర్తి కేవైసీ చేయడం ద్వారా బేసిక్ ఖాతాలను సాధారణ ఖాతాలుగా మార్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంటే ప్రస్తుత బ్యాంక్ ఖాతాల మొబైల్ , ఆధార్ సీడింగ్ పూర్తి చేయనున్నారు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Aadhaar Card, Bank account, Finance minister, Mudra loan, Nirmala sitharaman

  ఉత్తమ కథలు