DETAILS ABOUT BEST CREDIT CARDS WITH MILESTONE BENEFITS UMG GH
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడుతున్నారా..? ఓసారి ఈ బెన్‌ఫిట్స్‌పై ఓ లుక్కేయండి
క్రెడిట్ కార్డు వల్ల చాలా లాభాలున్నాయి.
క్రెడిట్ కార్డ్ (Credit Card)లపై నిర్దిష్ట స్పెండింగ్ లిమిట్ థ్రెషోల్డ్‌ను దాటిన తర్వాత కస్టమర్లకు మైల్స్టోన్ బెనిఫిట్స్ లభిస్తాయి. షాపింగ్ (Shopping), ట్రావెలింగ్ (Travelling), ఎంటర్టైన్మెంట్ మొదలైన విభాగాలలో ఈ ప్రయోజనాలు పొందవచ్చు. మైల్స్టోన్ ప్రివిలేజ్లు క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా ఖర్చు చేసే వారికి సహాయపడతాయి.
క్రెడిట్ కార్డ్‌లపై నిర్దిష్ట స్పెండింగ్ లిమిట్ థ్రెషోల్డ్‌ను దాటిన తర్వాత కస్టమర్లకు మైల్స్టోన్ బెనిఫిట్స్ లభిస్తాయి. షాపింగ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్ మొదలైన విభాగాలలో ఈ ప్రయోజనాలు పొందవచ్చు. మైల్స్టోన్ ప్రివిలేజ్లు క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా ఖర్చు చేసే వారికి సహాయపడతాయి. క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించే వారికి బెస్ట్ బెనిఫిట్స్ అందించే కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోండి.
RBL Bank
ఆర్బీఎల్ ఎడిషన్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్ ప్రతి సంవత్సరం రూ.2 లక్షలు ఖర్చు చేయడంపై 2000 'ఎడిషన్ క్యాష్'ని అందిస్తుంది. ఒక ఎడిషన్ వ్యాల్యూ ఒక రూపాయికి సమానం. వినియోగదారులు జొమాటోలో ఆర్డర్లు చేయడానికి ఎడిషన్ క్యాష్‌ని ఉపయోగించవచ్చు. 500 ఎడిషన్ క్యాష్ వెల్కమ్ బెనిఫిట్ కింద అందుతుంది. జొమాటో ద్వారా డైనింగ్ లేదా ఫుడ్ కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100పై ఐదు ఎడిషన్ క్యాష్ అందుతుంది. ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.500.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ కార్డ్‌పై రూ.40,000 ఖర్చు చేయడం ద్వారా ప్రతి నెలా రూ.500 విలువైన కల్ట్.ఫిట్ లైవ్ ఒక నెల సబ్స్క్రిప్షన్, బుక్ మై షో, టాటా క్లిక్, ఓలా క్యాబ్స్ వోచర్లను అందిస్తుంది. ఏడాదిలో రూ.5 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అమెజాన్ ప్రైమ్, జొమాటో ప్రో, టైమ్స్ ప్రైమ్ మొదలైన వాటి వార్షిక సబ్స్క్రిప్షన్లు వినియోగదారులకు కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు రూ.2,500.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్బీఐ కార్డ్ ప్రైమ్‌లో రూ.5 లక్షలను ఖర్చు చేస్తే యాత్రా.కామ్ లేదా పాంటలూన్స్ నుంచి రూ.7,000 విలువైన ఇ-గిఫ్ట్ వోచర్లను పొందవచ్చు. వినియోగదారులు ఒక త్రైమాసికంలో రూ.50,000 ఖర్చు చేస్తే రూ.1,000 విలువైన పిజ్జా హట్ ఇ-వోచర్‌ను కూడా పొందుతారు. ఒక సంవత్సరంలో కనీసం రూ.3 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంలో ఎనిమిది, విదేశాలలో నాలుగు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.2,999.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ కార్డ్ జారీ చేసిన మొదటి 90 రోజులలో రూ.75,000 ఖర్చు చేస్తే 3,000 బోనస్ క్యాస్ వ్యాల్యూ పాయింట్స్ అందిస్తుంది. ఇది బోనస్ క్లబ్ విస్తారా పాయింట్లను, ఒక సంవత్సరంలో చేసే ఖర్చులపై కాంప్లిమెంటరీ ప్రీమియం ఎకానమీ టిక్కెట్లను కూడా అందిస్తుంది. ఇందులో సంవత్సరానికి గరిష్టంగా నాలుగు ప్రీమియం ఎకానమీ టిక్కెట్లు ఉంటాయి. అంటే రూ. 1.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4.5 లక్షలు, రూ.9 లక్షల లిమిట్‌ను దాటిన ప్రతిసారి ఒక ప్రీమియం టిక్కెట్ దక్కుతుంది. ఈ కార్డుల యాన్యువల్ ఫీజు రూ.3,000.
SBI ఎలైట్ కార్డ్
ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డ్ ప్రతి సంవత్సరం రూ.12,500కి సమానమైన 50,000 బోనస్ రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. వినియోగదారులు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు వార్షిక ఖర్చు చేసినప్పుడు 10,000 బోనస్ రివార్డ్ పాయింట్లను పొందుతారు. వినియోగదారులు ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేస్తే, 15,000 బోనస్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఒక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము మినహాయింపు లభిస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ విలువ రూ.0.25. ఇది కాంప్లిమెంటరీ ట్రైడెంట్ ప్రివిలేజ్ రెడ్ టైర్ సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. ప్రతి త్రైమాసికంలో రెండుసార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కార్డు యాన్యువల్ ఫీజు రూ.4,999గా ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.