ఆహారం, ఇంధన ధరల పెరుగుదలతో ప్రపంచం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం తీవ్రతను తగ్గించే చర్యలు తీసుకుంటున్నాయి. యూఎస్‌లో ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచాల్సిన సూచనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఇంటి నిర్వహణ ఖర్చు విపరీతంగా పెరిగింది. అయితే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ షాక్‌లు ఉన్నప్పటికీ.. భారతదేశం ఇప్పటికీ ఈ అనిశ్చితి యుగంలో బలంగా కనిపిస్తోందని SBI Ecowrap తాజా నివేదిక పేర్కొంది. ఇండియా బలంగా ఉండటానికి కారణాలను విశ్లేషించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఆహార, ఇంధన ధరలు ప్రభావం ఇండియాలో తక్కువే
నివేదికలో భారతదేశం, యూఎస్, యూకే, జర్మనీ జీవన వ్యయాలను విశ్లేషించింది. 2021 సెప్టెంబర్‌లో అన్ని దేశాలలో ఇంటి నిర్వహణ బడ్జెట్/జీవన వ్యయం రూ.100 అయితే, అది ఇప్పుడు యూఎస్, ఇండియాలో రూ.12 పెరిగినట్లు తెలిపింది. అదే విధంగా జర్మనీలో రూ.20, యూకేలో రూ.23 పెరిగినట్లు పేర్కొంది.
అంతేకాకుండా ఆహార ధరల విషయంలో అమెరికా, యూకే, జర్మనీల కంటే భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని నివేదిక స్పష్టం చేసింది.
2021 సెప్టెంబర్‌లో అన్ని దేశాల్లో రూ.100 ధరతో ఉండే ఆహార పదార్థాలపై.. ఇప్పుడు యూఎస్‌లో రూ.25, యూకేలో రూ.18, జర్మనీలో రూ.33, ఇండియాలో రూ.15 చొప్పున పెరుగుదల కనిపించిందని తెలిపింది.
* యూకేలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
ఆయా దేశాల్లో ఇంధన ధరల వివరాలను కూడా నివేదిక విశ్లేషించింది. 2021 సెప్టెంబర్‌లో రూ.100 ధర ఉంటూ.. ఇప్పుడు యూఎస్‌లో రూ.12 పెరిగింది. యూకేలో రూ.93, జర్మనీలో రూ.62, భారతదేశంలో రూ.16 మేర పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. ఈ నివేదిక రూపాయితో సమానత్వాన్ని సాధించడానికి ప్రతి దేశం మారకపు రేటు (డాలర్, యూరో, పౌండ్) సర్దుబాటు చేయడం ద్వారా నాలుగు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూపింది.
ప్రతి దేశం హౌసింగ్ CPI సూచిక కూడా రూపాయితో పోల్చితే మారకం ధరలలో సంబంధిత మార్పులతో రూపాంతరం చెందింది. యూఎస్‌లో జీవన వ్యయం రూ.21, భారతదేశంలో రూ.6 పెరిగింది. అత్యధికంగా యూకేలో రూ.30 పెరుగుదల కనిపించింది. అదే విధంగా జర్మనీలో జీవన వ్యయం రూ.21 పెరిగింది.
* ఫెడ్ రేట్లు మంచీ పెంచవచ్చు
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత వల్ల, రాజకీయ ఉద్రిక్తల కారణంగా పరిస్థితులు దిగజారాయని పేర్కొంది. అయితే బలమైన ఆర్థిక వ్యవస్థలుగా పేర్కొనే దేశాల కంటే ఇండియా మెరుగ్గా ఉందని తెలిపింది. జీవన వ్యయానికి సంబంధించి భారతదేశ తలసరి ఆదాయాన్ని (PCI) ప్రస్తావిస్తూ.. గత ఎనిమిదేళ్లలో దేశ PCI డాలర్ పరంగా 57% పెరిగిందని నివేదిక వివరించింది.
యూఎస్ జాబ్ మార్కెట్ బలంగా ఉందని, లేబర్ మార్కెట్‌పై గట్టి పట్టు సాధించేందుకు ఫెడ్ మరికొన్ని రేట్ల పెంపుదల చేయాల్సి రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరం జులై 29 వరకు 14.7 బిలియన్ డాలర్ల మూలధన ప్రవాహాలలో 72% ఇప్పటికే రికవర్ చేయడంతో భారతదేశం పటిష్ఠంగా ఉందని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.