perpersమీకు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? మినిమమ్ బ్యాలెన్స్‌ను పెంచింది. ప్రస్తుతం రూ.50 ఉన్న మినిమమ్ బ్యాలెన్స్‌ను రూ.500 చేసింది. అంటే పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఇకపై రూ.50 కాకుండా రూ.500 బ్యాలెన్స్ మెయింటైన్ చేయకతప్పదు. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ రూ.500 మెయింటైన్ చేయకపోతే మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.100 పెనాల్టీ రూపంలో వసూలు చేస్తుంది పోస్ట్ ఆఫీస్. ఈ కొత్త నిబంధనలు 2020 మార్చి 31 నుంచి అమలులోకి వస్తాయి. అందుకే ఓసారి మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. రూ.500 కన్నా తక్కువగా ఉంటే వెంటనే డిపాజిట్ చేయండి. లేకపోతే రూ.100 పెనాల్టీ చెల్లించక తప్పదు.
ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ డైరెక్టరేట్ అన్ని పోస్ట్ ఆఫీసులకు సమాచారం ఇచ్చింది. పోస్ట్ ఆఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్లలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలా అకౌంట్ హోల్డర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో మారిన నిబంధనల గురించి ఖాతాదారులకు అవగాహన కల్పించాలని కోరింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో కేవలం రూ.50 మినిమమ్ బ్యాలెన్స్ ఉండటం వల్ల పోస్ట్ ఆఫీసులు ఏటా రూ.2800 కోట్లు నష్టపోతున్నట్టు పోస్టల్ డిపార్ట్‌మెంట్ అంచనా. అందుకే మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మార్చింది. కనీస బ్యాలెన్స్‌ను రూ.50 నుంచి రూ.500 చేసింది. అంతేకాదు... ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరి రోజు అంటే మార్చి 31 నాటికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉంటే ఆటోమెటిక్‌గా ఆ అకౌంట్ క్లోజ్ అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ హోల్డర్‌కు చెక్ బుక్, ఏటీఎం సదుపాయం కూడా ఉంటుంది. డిపాజిట్లపై ఏటా 4 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.10,000 వడ్డీపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
Indian Railways: హోటల్‌గా మారిపోయిన రైలు... ఎలా ఉందో చూడండి
SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్... ఆ ఛార్జీలు పెరిగాయి
Rs 2000 Notes: ఏటీఎంలో రూ.2000 నోట్లు బంద్... ఎందుకో తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, India post, India post payments bank, Investment Plans, Money, Personal Finance, Save Money