• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DEPARTMENT OF POSTS HAS ISSUED NEW RULES FOR DEDUCTION OF TDS IF THE AGGREGATE WITHDRAWAL FROM ALL POST OFFICE SCHEMES IS MORE THAN RS 20 LAKH NS GH

India Post: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా? అయితే, ఈ కొత్త రూల్స్​ను తప్పక తెలుసుకోండి

India Post: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా? అయితే, ఈ కొత్త రూల్స్​ను తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

TDS on Cash Withdrawals: రానున్న 2021–22 ఆర్థిక సంవత్సరంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్​లో ఖాతా ఉన్న వారు, వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు పన్ను మినహాయింపు కోసం ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సి ఉంది

  • Share this:
ఈ రోజు(మార్చి 31)తో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. దీంతో, 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. దీంతో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పోస్టాఫీస్​లో అకౌంట్​ ఉన్న వారు, వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు పన్ను మినహాయింపు కోసం కొత్త నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. ఇకపై పోస్టాఫీసు పథకాల నుండి రూ.20 లక్షలకు మించి డబ్బుల ఉపసంహరణ చేసుకున్న వారి విషయంలో టీడీఎస్​ తగ్గింపుపై కొత్త నిబంధనలను జారీ చేసింది పోస్టల్​ డిపార్ట్​మెంట్​. ఈ నిబంధనలు పీపీఎఫ్​ ఉపసంహరణలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్​ 194 ఎన్​తో సవరించిన నిబంధనలకు అనుగుణంగా, గడిచిన మూడు అసెస్​మెంట్​ ఇయర్స్​గాను పెట్టుబడిదారుడు ఆదాయపు పన్ను రిటర్న్స్​ను(ఐటీఆర్​) దాఖలు చేయకపోతే, అప్పుడు ఉపసంహరణ మొత్తం నుండి టీడీఎస్​ కట్టాల్సి ఉంటుంది. అనగా, ఒక పెట్టుబడిదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య నగదు ఉపసంహరణ చేస్తే, అప్పుడు రెండు శాతం చొప్పున టీడీఎస్ తీసివేయబడుతుంది.

ఈ నిబంధన రూ .20 లక్షలకు దాటిన మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. కాగా, ఈ కొత్త నిబంధన 2020 జూలై 1 నుండి వర్తిస్తుందని పోస్టల్​ డిపార్ట్​మెంట్​ స్పష్టం చేసింది. ఒకవేళ అన్ని పోస్టాఫీసు ఖాతాల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం నగదు ఉపసంహరణ రూ .1 కోటి దాటితే, అప్పుడు 5 శాతం చొప్పున టీడీఎస్ ని రూ. కోటి దాటిన మొత్తానికి చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 1 కోటి దాటితే 5 శాతం టీడీఎస్​ కట్​..
ఆర్థిక సంవత్సరంలో పోస్టాఫీసు స్కీమ్​ల నుంచి ఉపసంహరించే మొత్తం రూ.1 కోటి దాటితే.. పరిధి దాటిన మొత్తానికి 5 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్​ను సవరించడంలో, పోస్టాఫీసు డిపాజిట్లను సులభతరం చేయడంలో ఈ కొత్త నిబంధనను చేర్చింది. కాగా, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సీఈపీటీ) 2020 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మధ్య కాలంలోని డిపాజిటర్ల వివరాలను ఇప్పటికే గుర్తించింది. సంబంధిత సర్కిల్‌లకు అవసరమైన వివరాలను సీఈపీటీ అందిస్తుంది. ఖాతా, ఖాతాదారుడి పాన్ నంబర్, టీడీఎస్​ రూపంలో కట్​ చేయాల్సిన నగదు వివరాలను సీఈపీటీ ఆయా సర్కిళ్లకు అందించింది. కాగా, టీడీఎస్​ మినహాయింపు గురించి సంబంధిత ఖాతాదారునికి ముందుగానే తెలియజేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు