Post Office Account: ఏటీఎం కార్డు మార్చకపోతే ఫిబ్రవరి 1 నుంచి పనిచేయదు

Post Office Savings Bank Account | పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. మీ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు ఉంటే వెంటనే పోస్ట్ ఆఫీసుకి వెళ్లి మార్చుకోవాలి.

news18-telugu
Updated: January 31, 2020, 12:04 PM IST
Post Office Account: ఏటీఎం కార్డు మార్చకపోతే ఫిబ్రవరి 1 నుంచి పనిచేయదు
Post Office Account: ఏటీఎం కార్డు మార్చకపోతే ఫిబ్రవరి 1 నుంచి పనిచేయదు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంక్-POSB అకౌంట్ ఉందా? అయితే మీరు మీ ఏటీఎం కార్డు మార్చాల్సి ఉంటుంది. మీ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు ఉన్నట్టైతే వాటిని మార్చుకొని ఈఎంవీ చిప్ ఉన్న ఏటీఎం కార్డు తీసుకోవాలి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లకు ఈఎంవీ చిప్ కార్డుల్ని అందించింది. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ డెబిట్ కార్డుల్ని బ్లాక్ చేసింది. ఇప్పుడు ఇండియా పోస్ట్ కూడా అదే పని చేస్తోంది. ఒకవేళ మీ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు ఉంటే మీ అకౌంట్ ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఈఎంవీ చిప్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి. ఏటీఎం కార్డుల్ని మార్చడానికి 2020 జనవరి 31 చివరి తేదీ. అంటే 2020 ఫిబ్రవరి 1 నుంచి మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు పనిచేయదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్ లైన్స్ ప్రకారం కస్టమర్లకు తప్పనిసరిగా ఈఎంవీ చిప్ ఉన్న ఏటీఎం కార్డుల్నే ఇవ్వాలి. అందుకే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లంతా ఈఎంవీ చిప్ ఉన్న ఏటీఎం కార్డు తీసుకోవాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ కోరుతోంది. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులతో పోలిస్తే ఈఎంవీ చిప్ కార్డులో డేటా ఎన్‌క్రిప్షన్, స్టోరేజ్ టెక్నాలజీ హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. సైబర్ నేరగాళ్లు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డు నుంచి డేటాను సులువుగా కొట్టేయొచ్చు కానీ... ఈఎంవీ చిప్ కార్డు నుంచి డేటాను సేకరించడం అంత ఈజీ కాదు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకే బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీస్ కూడా ఏటీఎం కార్డుల్ని అప్‌గ్రేడ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

SBI Alert: ఈ తప్పుతో డబ్బులు పోతాయి... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ



Home Loan: హోమ్ లోన్‌కు అప్లై చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ

PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: January 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు