Home /News /business /

DENTAL INSURANCE NEW INSURANCE PLAN FROM PNB METLIFE LAUNCHING DENTAL CARE INSURANCE SCHEME FOR THE FIRST TIME GH VB

Dental Insurance: PNB మెట్‌లైఫ్ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. మొదటిసారి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (PNB MetLife India Insurance) దంతాల కోసం కూడా బీమా అందించాలని నిర్ణయించింది. తాజాగా ఈ సంస్థ కొత్తగా ఓ దంత ఆరోగ్య బీమా పథకాన్ని (Dental Care Insurance Plan) ప్రారంభించింది.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో చాలామంది దంత సమస్యల (Dental Problems)తో బాధపడుతున్నారు. దంతాలకు చికిత్స చేయించుకుందామంటే డెంటల్ ట్రీట్‌మెంట్స్ చాలా వ్యయభారంగా మారాయి. టూత్-ఫిల్లింగ్స్ వంటి చిన్నపాటి చికిత్సలకు కూడా వేలల్లో డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. రోజురోజుకీ ఈ చికిత్సల వ్యయభారం అధికమవుతోంది. ఫలితంగా దంతాల సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు హాస్పిటల్(Hospital) ఖర్చులు భరించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు చికిత్స పొందేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. ఫలితంగా దంతవ్యాధులు ముదురుతున్నాయి. హాస్పిటల్ ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (PNB MetLife India Insurance) దంతాల కోసం కూడా బీమా అందించాలని నిర్ణయించింది.

తాజాగా ఈ సంస్థ కొత్తగా ఓ దంత ఆరోగ్య బీమా పథకాన్ని (Dental Care Insurance Plan) ప్రారంభించింది. ఫిక్స్‌డ్-బెనిఫిట్ అవుట్‌పేషెంట్ ఖర్చులను కవర్ కవర్ చేయడంతో సహా మొత్తం దంత ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించే ఇన్సూరెన్స్ ప్లాన్‌గా దీనిని తీసుకొచ్చింది. భారత్‌లో ఇలాంటి బెనిఫిట్స్ అందించే బీమా ప్లాన్ తీసుకురావడం ఇదే మొదటిసారి అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్ సహాయంతో దంతచికిత్స లకు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాదని కంపెనీ తెలిపింది. నిజానికి భారతదేశంలో చాలా రకాల ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా దంత బీమా (Dental Insurance) అందుబాటులో ఉండటం చాలా అరుదు.

Wheat: పెట్రోల్‌కు పోటీగా గోధుమపిండి ధర.. కేంద్రం సంచలన నిర్ణయం.. గోధుమల ఎగుమతిపై నిషేధం


ఈ డెంటల్ ఇన్సూరెన్స్ అనేది దంత చికిత్స ఖర్చులను కవర్ చేసే ఒక రకమైన ఆరోగ్య బీమా. ఇలాంటి బీమాని పరిచయం చేసి పీఎన్‌బీ మెట్‌లైఫ్ దంత సమస్యలు ఉన్నవారికి భారీ ఊరటను కల్పిస్తోంది. ఈ బీమా ప్లాన్‌ ప్రధాన దంత చికిత్సలను కవర్ చేస్తుంది. దీనివల్ల దంత చికిత్స ఖర్చుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. పీఎన్‌బీ మెట్‌లైఫ్ కొత్త డెంటల్ కేర్ ప్లాన్ (Dental Care Plan) అనేది కస్టమర్లు వారి దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఈ ప్లాన్‌తో దంత చికిత్స కోసం పేషెంట్లు తాము చేసిన పొదుపు నుంచి భారీగా డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు.

అలాగే అన్ని ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా రాదు. తన కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందించడానికి, పీఎన్‌బీ 340 కంటే ఎక్కువ డెంటల్ క్లినిక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్లాన్‌ ద్వారా ఒక్కో దంత చికిత్సకు రూ.350 నుంచి రూ.7,500 వరకు ఫిక్స్‌డ్-బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.50,000 వరకు హామీ మొత్తం దక్కించుకోవచ్చు. ఈ బీమా క్లయిమ్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. "నోటి/దంత ఆరోగ్యం మంచిగా ఉంటే మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం వల్ల మీరు దంత సమస్యలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. దంత వ్యాధులకు మొగ్గ దశలోనే చెక్ పెట్టొచ్చు. పీఎన్‌బీ మెట్‌లైఫ్ డెంటల్ కేర్ ప్లాన్ మీరు మా దంతవైద్యుల నెట్‌వర్క్‌లో నోటి పరీక్ష, శుభ్రపరిచే ఖర్చుతో సహా కవర్ ప్రొసీజర్‌లను పొందినట్లయితే స్థిర మొత్తాలను చెల్లిస్తుంది." అని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరిన్ని వివరాలకు ఈ

https://www.pnbmetlife.com/insurance-plans/family-protection/dental-care-plan.html లింక్ విజిట్ చేయొచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Accidental benfits, Dental care, Health Insurance, Punjab National Bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు