Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

Banks Merger | బ్యాంకుల విలీనం ప్రక్రియ పూర్తైంది కాబట్టి ఇప్పుడు కస్టమర్లు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చర్చ మొదలైంది. మరి మీకు దేనా బ్యాంక్ లేదా విజయా బ్యాంకులు అకౌంట్ ఉంటే ఏం చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 2, 2019, 11:12 AM IST
Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే
Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే
  • Share this:
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు విలీనమయ్యాయి. ఈ మూడు బ్యాంకుల్ని ఒక్కటి చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1న విలీన ప్రక్రియ పూర్తైపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. మొత్తం బ్యాంకింగ్ రంగంలో చూస్తే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత మూడో స్థానంలో నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంకుల విలీనం కొత్తేమీ కాదు. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకుల్ని విలీనం చేసింది కేంద్రం. దీంతో భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవతరించింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు బ్యాంకుల విలీనం పూర్తైంది.

Read this: New Rules: ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే...

Bank of Baroda, Dena Bank, Vijaya Bank merger, banks merger, banks merging chart, merger of banks advantages and disadvantages, merger of banks in india latest news, bank merger news today, psu banks merger, bank merger in india, vijaya bank merger, bank merger news today, bank merger list, reasons why banks merge, what is merger of banks, advantages of banks merge, బ్యాంకుల విలీనం, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకుల విలీన ప్రక్రియ

ఇక దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ బ్రాంచులన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఔట్‌లెట్స్‌గా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు 9,500 బ్రాంచులు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులు, 12 కోట్ల కస్టమర్లు ఉండటం విశేషం. రూ.15 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉండగా, రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్స్, రూ.6.25 లక్షల కోట్ల అడ్వాన్సులు ఉన్నట్టు లెక్క తేలింది. బ్యాంకుల విలీనం ప్రక్రియ పూర్తైంది కాబట్టి ఇప్పుడు కస్టమర్లు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చర్చ మొదలైంది. మరి మీకు దేనా బ్యాంక్ లేదా విజయా బ్యాంకులు అకౌంట్ ఉంటే ఏం చేయాలో తెలుసుకోండి.



Read this: LIC Online Policy: ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే డిస్కౌంట్

Bank of Baroda, Dena Bank, Vijaya Bank merger, banks merger, banks merging chart, merger of banks advantages and disadvantages, merger of banks in india latest news, bank merger news today, psu banks merger, bank merger in india, vijaya bank merger, bank merger news today, bank merger list, reasons why banks merge, what is merger of banks, advantages of banks merge, బ్యాంకుల విలీనం, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకుల విలీన ప్రక్రియ


బ్యాంకుల విలీనం... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

దేనా బ్యాంక్, విజయా బ్యాంకులో ఉన్న అకౌంట్లు యథాతథంగా కొనసాగుతాయి.
అకౌంట్ల విషయంలో ఏవైనా మార్పులు ఉంటే బ్యాంకులు సమాచారం ఇస్తాయి.
ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ వాడుకోవచ్చు.
ఇకపై కొత్త కార్డులన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా పేరుతో వస్తాయి.
నగదు, చెక్కుల డిపాజిట్ కోసం కస్టమర్లు వారి బ్రాంచ్‌కే వెళ్లాలి.
అకౌంట్ బ్యాలెన్స్ లిమిట్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న బ్రాంచుల లొకేషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
ఇప్పటికిప్పుడు బ్రాంచులను మూసివేసే ఆలోచన లేదు.
ఒకవేళ బ్రాంచుల్ని మూసేస్తే లాకర్లు ఉన్నవారికి కొత్త బ్రాంచ్‌లో లాకర్లు ఇస్తారు.
రుణాలకు సంబంధించి నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
ఎలాంటి మార్పుచేర్పులైనా కస్టమర్లకు సమాచారం వస్తుంది. కస్టమర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకుంటారు.
ఈ మూడు బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
డిజిటల్ బ్యాంకింగ్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
బ్యాంకులు విలీనమైనా మీ అకౌంట్‌లో డబ్బులు సురక్షితంగానే ఉంటాయి.
ఛార్జీలు, సేవల విషయంలో అనుమానం ఉంటే దగ్గర్లో ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.
ఉచిత సేవలు, ఛార్జీలు, డిపాజిట్లకు, రుణాలకు వడ్డీ రేట్లు, మినిమం బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోండి.
బ్యాంకుల విలీనంపై వచ్చే పుకార్లను అస్సలు పట్టించుకోవద్దు.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి

ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్... తేడాలేంటీ?

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు
First published: April 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>