Banks Merger: మూడు బ్యాంకుల విలీనం... కస్టమర్లు తెలుసుకోవాల్సిన 20 అంశాలివే...

బ్యాంకులు విలీనమైన తర్వాత అకౌంట్స్, లాకర్, డిపాజిట్స్, లోన్స్ అన్నీ కొత్త బ్యాంకు పరిధిలోకి వస్తాయి. కస్టమర్లకు బ్యాంకు నుంచి ఇ-మెయిల్, లెటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తుంటాయి.

news18-telugu
Updated: March 31, 2019, 5:19 PM IST
Banks Merger: మూడు బ్యాంకుల విలీనం... కస్టమర్లు తెలుసుకోవాల్సిన 20 అంశాలివే...
బ్యాంకుల విలీనం: కస్టమర్లు తెలుసుకోవాల్సిన 20 అంశాలివే...
  • Share this:
బ్యాంకుల విలీనం గురించి చర్చ మళ్లీ మొదలైంది. మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక్కటౌతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి విజయా, దేనా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాబోతున్నాయి. రెండేళ్ల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు బ్యాంకులు విలీనమయ్యాయి. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఎస్‌బీఐ అవతరించింది. ఇప్పుడు విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనంతో బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. బ్యాంకుల విలీనం అన్నది రాత్రికి రాత్రే ముగిసిపోయే ప్రక్రియ కాదు. మరి బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు తెలుసుకోవాల్సిన 20 అంశాలివే.

1. బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లకే లాభాలు ఎక్కువ.

2. విలీనం వల్ల కస్టమర్లు ఆందోళన చెందాల్సినదేమీ లేదు.
3. విలీనం అయ్యే బ్యాంకుల్లో ఉన్న డబ్బులు సురక్షితంగానే ఉంటాయి.
4. అసలు విలీనం ఎందుకు చేస్తున్నారో అధ్యయనం చేయండి.
5. కొత్తగా రూపాంతరం చెందే బ్యాంకు ఛార్జీలు, సేవలు తెలుసుకోండి.
6. ఉచిత సేవలు, ఛార్జీలు, డిపాజిట్లకు, రుణాలకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కోండి.7. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి.
8. ఎందుకంటే కొత్త బ్యాంకులో నియమ, నిబంధనలు మారతాయి.
9. పుకార్లను పట్టించుకోకుండా అధికారికంగా వచ్చే ప్రకటనల్నే నమ్మండి.
10 . కస్టమర్లకు బ్యాంకు నుంచి ఇ-మెయిల్, లెటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తుంటాయి.
11. బ్యాంకులు విలీనమైన తర్వాత అకౌంట్స్, లాకర్, డిపాజిట్స్, లోన్స్ అన్నీ కొత్త బ్యాంకు పరిధిలోకి వస్తాయి.
12. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తెలుసుకోండి.
13. కొత్త వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసేముందు అది బ్యాంకు సైట్ అవునో కాదో చూసుకోండి.
14. విలీనం అనగానే కంగారుపడి డిపాజిట్లు విత్‌డ్రా చేసుకోకండి.
15. మీకు దగ్గర్లో ఎక్కడెక్కడ బ్రాంచులు, ఏటీఎంలు ఉన్నాయో తెలుసుకోండి.
16. ఎక్కువ బ్రాంచులు, ఏటీఎంలు ఉంటాయి కాబట్టి సేవలు సులువవుతాయి.
17. ఇలాంటి సమయంలో మోసపూరిత ఇ-మెయిల్స్, ఎస్ఎంఎస్‌లు వస్తుంటాయి.
18. అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది.
19. మీ అకౌంట్, కార్డుల వివరాలు, పాస్‌వర్డ్స్ ఎవరికీ చెప్పకూడదు.
20. ఏ అనుమానం వచ్చిన బ్యాంక్ బ్రాంచ్, కాల్‌సెంటర్‌ను సంప్రదించండి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ పోయిందా? డూప్లికేట్ కార్డ్ ఇలా పొందొచ్చు

ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే

MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం
Published by: Santhosh Kumar S
First published: March 31, 2019, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading