• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DEMAND FOR HYUNDAI CRETA IS THREE TIMES THE PRODUCTION CAPACITY NS GH

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటాకి భారీ డిమాండ్.. ఉత్పత్తి సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ బుకింగ్‌లు

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటాకి భారీ డిమాండ్.. ఉత్పత్తి సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ బుకింగ్‌లు

ప్రతీకాత్మక చిత్రం

హ్యుందాయ్ 2015లో క్రెటాను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గతేడాది సెకండ్ జెనరేషన్ క్రెటాను భారత్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి దీనికి డిమాండ్ ఊహించని విధంగా రోజు రోజుకూ పెరుగుతోంది.

  • Share this:


హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా SUVకి భారత్‌లో మంచి ఆదరణ లభించింది. ఈ మోడల్‌కు దేశంలో డిమాండ్ భారీగా పెరుగుతోందని హ్యుందాయ్ తెలిపింది. క్రెటా ఉత్పత్తి సామర్థ్యానికి సుమారు మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ ఉందని సంస్థ తాజాగా ప్రకటించింది. హ్యుందాయ్ 2015లో క్రెటాను మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది సెకండ్ జెనరేషన్ క్రెటాను భారత్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి దీనికి డిమాండ్ ఊహించని విధంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVగా క్రెటా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ వాహనానికి బుకింగ్స్ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్లకు కొరత ఉన్నప్పటికీ, డిమాండ్‌కు అనుగుణంగా తయారీని పెంచే ఏర్పాట్లు చేస్తామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్.ఎస్ కిమ్ పేర్కొన్నారు.
 ప్రస్తుతం క్రెటా కోసం వచ్చిన ఆర్డర్లు, వాహనం ఉత్పత్తి సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని కిమ్ తెలిపారు. డిమాండ్ పెరగడంతో ప్రతి నెలా పెండింగ్ బుకింగ్‌లు పేరుకుపోతున్నాయని చెప్పారు. ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం సెకండ్ జెనరేషన్ క్రెటా E, EX మోడళ్లకు 32 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. మిగతా వేరియంట్లకు ఇది 24 వారాల వరకు ఉందని కిమ్ వివరించారు.
Automatic Cars: ఆటోమెటిక్ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే


ఆకట్టుకుంటున్న ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటాలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. మల్టిపుల్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో క్రెటాను రూపొందించారు. ఈ SUVలో పనోరమిక్ సన్ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీటు, ఎయిర్ ప్యూరిఫైయర్, కీలెస్ ఎంట్రీ, క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్.. వంటి ప్రీమియం ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.


పెరగనున్న మొత్తం అమ్మకాలు

2018లో భారత్‌లో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 5,50,002 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019లో మొత్తం సేల్స్ 5,10,260 యూనిట్లకు పడిపోయాయి. 2020లో ఈ సంఖ్య 4,23,642 యూనిట్లకు పరిమితమైంది. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్నందువల్ల మొత్తం అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో హ్యుందాయ్ మొత్తం SUV అమ్మకాలు 10 లక్షలు దాటినట్లు సంస్థ ఇటీవల ప్రకటించింది. క్రెటా, వెన్యూ మోడళ్లకు ఆదరణ లభించడంతో ఈ విభాగంలో సేల్స్ పెరిగాయి. వీటితో పాటు టక్సన్, కోనా ఈవీలు కూడా హ్యుందాయ్ SUV విభాగంలో ఉన్నాయి. త్వరలో అల్కాజర్ SUVని సంస్థ మార్కెట్లోకి విడుదల చేయనుంది.



Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు