హోమ్ /వార్తలు /బిజినెస్ /

Delhivery: మే 11- మే 13 మధ్య డెల్లీవరీ ఐపీఓ.. ఇష్యూ సైజు రూ.5,235 కోట్లకు తగ్గింపు.. కారణం ఏంటంటే..

Delhivery: మే 11- మే 13 మధ్య డెల్లీవరీ ఐపీఓ.. ఇష్యూ సైజు రూ.5,235 కోట్లకు తగ్గింపు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాజిస్టిక్స్, సప్లై చైన్ స్టార్టప్ కంపెనీ అయిన డెల్లీవరీ (Delhivery Ltd) ప్రజల ద్వారా నగదు సమీకరించేందుకు సిద్ధమయ్యింది. గురుగావ్ కు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ ఐపీఓకి (Delhivery IPO) వచ్చేందుకు జనవరి నెలలోనే సెబీ (Sebi) నుంచి క్లియరెన్స్ పొందింది.

ఇంకా చదవండి ...

లాజిస్టిక్స్(Logistics), సప్లై చైన్ స్టార్టప్ కంపెనీ(Startup Company) అయిన డెల్లీవరీ (Delhivery Ltd) ప్రజల ద్వారా నగదు సమీకరించేందుకు సిద్ధమయ్యింది. గురుగావ్ కు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ ఐపీఓకి (Delhivery IPO) వచ్చేందుకు జనవరి నెలలోనే సెబీ (Sebi) నుంచి క్లియరెన్స్(Clearance) పొందింది. అయితే ఆ సమయం నుంచి మార్కెట్ సెంటిమెంట్ ఆశించిన విధంగా లేకపోవడంతో ఐపీఓని(IPO) వాయిదా వేసుకుంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్‌స్క్రిప్షన్‌ను(Subscription) మే 11న ఓపెన్ చేయడానికి సన్నద్ధం అయ్యిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఐపీఓ మే 11న ప్రారంభమై మే 13న ముగుస్తుందని ఇద్దరు సీనియర్ బ్యాంకర్లు తాజాగా తెలిపారు.

Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

షేర్ల కేటాయింపు మే 19న ఉంటుందని, ఈ షేర్లు మే 23న డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయని తెలుస్తోంది. ఈ కంపెనీ మే 24న ఎక్స్ఛేంజీలలో జాబితా అవుతుందని మరొక బ్యాంకు అధికారి తెలిపారు. ఈ- కామర్స్ లాజిస్టిక్ సంస్థ అయిన డెల్లీవరీ మొదటగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.7,460 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ అంతగా బాగోలేదు కాబట్టి ఐపీఓ సైజును రూ.7,460 కోట్లు నుంచి రూ.5,235 కోట్లకు తగ్గించింది. ఈ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.4,000 కోట్ల తాజా షేర్లను విక్రయించనుంది. అలానే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 1,235 కోట్లను సమీకరించనుంది.

ఈ ఇష్యూలో Fosun గ్రూప్ యాజమాన్యంలోని చైనా మొమెంటం ఫండ్, తన అనుబంధ సంస్థ డెలి CMF Pte Ltd ద్వారా రూ.200 కోట్ల వరకు విక్రయిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో CA స్విఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా రూ.454 కోట్ల వరకు, SVF డోర్‌బెల్ లిమిటెడ్ ద్వారా రూ.365 కోట్ల వరకు, టైమ్స్ ఇంటర్నెట్ ద్వారా రూ.165 కోట్ల వరకు ఐపీఓకి రానున్నాయి. డెల్లీవరీ సహ వ్యవస్థాపకులు కూడా ఓఎఫ్ఎస్ లో పాల్గొంటారు. కపిల్ భారతి రూ.5 కోట్ల విలువైన షేర్లను, మోహిత్ టాండన్ రూ.40 కోట్ల విలువైన షేర్లను, సూరజ్ సహారన్ రూ.6 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు.

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం కంపెనీ ఆర్గానిక్, అకర్బన వృద్ధి ప్రోగ్రామ్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఇతర వ్యూహాల అమలు చేసేందుకు కూడా సరిపడా నిధులు అందిస్తుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్లు డెల్లీవరీ ఐపీఓకి లీడ్ బ్యాంకర్లుగా ఉన్నాయి. డెల్లీవరీ (Delhivery) సంస్థ దేశవ్యాప్తంగా 17,045 పిన్ కోడ్ లొకేషన్లలో తన సర్వీసెస్ ఆఫర్ చేస్తోంది. ఈ కంపెనీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్, రిటైల్, ఆటోమోటివ్, వంటి చాలా రంగాలకు చెందిన వస్తువులను డెలివర్ చేస్తోంది. ఇది టోటల్‌గా 21,342 సంస్థలకు లాజిస్టిక్స్ సర్వీసెస్ అందించడం విశేషం.

First published:

Tags: Home delivery, IPO, Issue, Logistics

ఉత్తమ కథలు