హోమ్ /వార్తలు /బిజినెస్ /

Seat Belts: సీట్ బెల్టు పెట్టుకోనందుకు జరిమానా.. రూ.1000 పెనాల్టీ విధించిన పోలీసులు..

Seat Belts: సీట్ బెల్టు పెట్టుకోనందుకు జరిమానా.. రూ.1000 పెనాల్టీ విధించిన పోలీసులు..

Image Credit : News18

Image Credit : News18

Seat Belts: కారు వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోతే జరిమానా విధిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తేల్చి చెప్పారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడంటే..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistri) ఇటీవల కారు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో బెంజ్ కారు వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ.. సీటు బెల్టు ధరించకపోవడంతోనే ప్రమాదంలో చనిపోయారనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కారు వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులు సీటు బెల్టు (Seat Belt) ధరించకపోతే జరిమానా విధిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఇటీవల తేల్చి చెప్పారు. తాజాగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు (Delhi Traffic Police) ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. కారు వెనుక సీట్లో కూర్చుని సీట్ బెల్టు ధరించని 17 మంది ప్రయాణికులకు పోలీసులు జరిమానా విధించారు.

* పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సెంట్రల్ ఢిల్లీ బరఖంబర రోడ్‌ సమీపంలోని కొన్నట్ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో మొత్తం 17 మందికి కోర్టు చలాన్లు విధించారు.

సదరు ప్రయాణికులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీటులో కూర్చొని సీటు బెల్టు ధరించలేదని పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 194B ప్రకారం..వెనుక సీట్లలో కూర్చొని సీటు బెల్టు ధరించని వారికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కారులో వెనుక సీట్లలో కూర్చున్నవారు బెల్టు ధరించడం గురించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు న్యూఢిల్లీ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆలప్ పటేల్. వెనుక సీటులో కూర్చొన్న వారు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి అని చట్టంలో ఉందన్నారు.

కానీ దాన్ని ప్రజలు అనుసరించట్లేదన్నారు. సైరస్ మిస్త్రీ మరణం నేపథ్యంలో ఈ నిబంధన గురించి చర్చ జరుగుతుండగా, నిబంధన పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన అధికారం ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. ఓ లుక్కేయండి

* సర్వేలో రూల్‌కు సపోర్ట్

కారు వెనుక సీటులో కూర్చొనే వారు సీటు బెల్టు ధరించాల్సిందేనని, లేదంటే జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను 10లో 9 మంది సమర్థించినట్లు ఓ సర్వేలో తేలింది. ఈ సర్వేలో 1,100 మంది పాల్గొనగా, అందులో మెట్రోపాలిటిన్ నగరాలు ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీకి చెందిన వారు ఉన్నారు.

అన్ని ఏజ్ గ్రూపుల వారు ఈ నిబంధనను సమర్థిస్తున్నట్లు సర్వేలో స్పష్టం అయింది. సర్వేలో 93 శాతం మంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించారు. అయితే, ఆచరణలో కచ్చితంగా ఈ నిబంధన అమలు సందేహమనేనని 28 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, CAR, Delhi, Traffic challans

ఉత్తమ కథలు