అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఝలక్.. ఈ కామర్స్ సంస్థలపై కేసుల మీద కేసులు..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు పరిమితికి మించి ఎక్కువ ప్లాస్టిక్‌ను వాడుతున్నాయంటూ ఓ విద్యార్థి జాతీయ హరిత ట్రిబ్యూనల్‌లో కేసు వేశాడు. ఢిల్లీకి చెందిన పదకొండో తరగతి విద్యార్థి ఆదిత్య దుబే ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశాడు.

news18-telugu
Updated: October 19, 2019, 1:56 PM IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఝలక్.. ఈ కామర్స్ సంస్థలపై కేసుల మీద కేసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారీ డిస్కౌంట్లు అందిస్తూ రిటైల్ వ్యాపారులకు తీవ్ర నష్టాలు కలిగిస్తోందంటూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఈ కామర్స్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే, తాజాగా, ఈ రెండు సంస్థలకు మరో షాక్ తగిలింది. పరిమితికి మించి ఎక్కువ ప్లాస్టిక్‌ను వాడుతున్నాయంటూ ఓ విద్యార్థి జాతీయ హరిత ట్రిబ్యూనల్‌లో కేసు వేశాడు. ఢిల్లీకి చెందిన పదకొండో తరగతి విద్యార్థి ఆదిత్య దుబే ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశాడు. కార్డ్‌ బోర్డ్ బాక్సులు, ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ బబుల్ వ్రాప్.. తదితరాలను ఎక్కువగా వాడుతోందని ఆరోపించాడు. ఇవి వాడొద్దని ఆ సంస్థలను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. అయితే, 2021 నాటికి పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడబోమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికే 25 శాతం వాడకాన్ని తగ్గించామని వెల్లడించింది. అటు.. అమెజాన్ కూడా 2020 జూన్ నాటికి పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని పేర్కొంది.

కాగా, డిస్కౌంట్లు ఇవ్వడానికి మీరెవరు అంటూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్లు దోపిడీని తలపిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ‘ఆఫర్లు ప్రకటించడానికి ఈ కామర్స్ సంస్థలకు ఎలాంటి అధికారం లేదు. రిటైల్ రంగాన్ని నష్టాల్లో పడేసేలా ఉత్పత్తులు అమ్మడానికి అనుమతి లేదు’ అని ఆయన మీడియాతో తెలిపారు. ఆ కంపెనీలు సొంత ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా అధికారం లేదని వెల్లడించారు. ఈ కామర్స్ సంస్థలు కేవలం కొనుగోలుదార్లకు, అమ్మకం దార్లకు మధ్య సహాయకారి మాత్రమేనని వివరించారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు