విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశం...

ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టించడంలో ఈడీ విజయం సాధించింది. ఇక తదుపరి టార్గెట్ మాత్రం విజయ్ మాల్యానే అనే ప్రచారం జోరందుకుంది. అందుకు తగ్గట్టే మాల్యా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

news18-telugu
Updated: March 23, 2019, 7:11 PM IST
విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశం...
విజయ్ మాల్యా
news18-telugu
Updated: March 23, 2019, 7:11 PM IST
లండన్‌లో తలదాచుకుంటున్నఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. బెంగుళూరులో విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. విజయ్ మాల్యా ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు న్యాయస్థానం గుర్తించింది. దీంతో మాల్యాకు చెందిన ఆస్తులను జూలై 10 తేదీలోగా అటాచ్ చేయాల్సిందిగా చీఫ్ మెట్రోపొలిటిన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ తాజా ఉత్తర్వులు జారీచేశారు.

ఇదిలా ఉంటే బెంగుళూరు పోలీసులు ఇప్పటికే మాల్యాకు చెందిన 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానికి నివేదించింది. ఇదిలా ఉంటే విజయ్ మాల్యాను ఇప్పటికే కోర్టు ఉల్లంఘనకు పాల్పడినట్లు జనవరిలో న్యాయస్థానం గుర్తించింది.

గత సంవత్సరం మే నెలలో న్యాయస్థానం మాల్యా ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. కాగా ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో వరుసగా సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు ఎదుట మాల్యా హాజరు కాలేదని కోర్టు పేర్కొంది. అంతేకాదు ఏప్రిల్ 12, 2017న నాన్ బెయలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

ఇప్పటికే లండన్‌లోనే తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టించడంలో ఈడీ విజయం సాధించింది. అయితే తదుపరి టార్గెట్ మాత్రం విజయ్ మాల్యానే అనే ప్రచారం జోరందుకుంది.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...