హోమ్ /వార్తలు /బిజినెస్ /

SpiceJet: స్పైట్ జెట్‌కు బిగ్ షాక్.. వారికి రూ. 243 కోట్లు చెల్లించాల్సిందే..

SpiceJet: స్పైట్ జెట్‌కు బిగ్ షాక్.. వారికి రూ. 243 కోట్లు చెల్లించాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో స్పైస్‌జెట్ యాజమాన్యం విఫలమైతే మారన్ మరియు అతని కంపెనీ స్పైస్ జెట్ వాటాపై యథాతథ స్థితిని కోరుతూ వారి అభ్యర్ధనను పునరుద్ధరించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.

  ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్ (Spicejet)కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఆ సంస్థ మాజీ ప్రమోటర్ సన్ గ్రూప్‌కు చెందిన కళానిధి మారన్, ఆయన KLA ఎయిర్‌వేస్ 2018లో దాఖలు చేసిన కేసుపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్, కేఏఎల్ ఎయిర్వేస్ 2018లో స్పైస్‌జెట్‌ సంస్థలో పెట్టిన పెట్టుబడికి 243 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించాలని తీర్పును వెలువరించింది. కాగా ఈ చెల్లింపు ఆరు వారాల్లో జరగాలని ఆదేశించింది. ఈ మొత్తం మారన్, కెఎఎల్ ఎయిర్వేస్ 2018లో స్పైస్‌జెట్ పెట్టిన మొత్తం పెట్టుబడికి వడ్డీ చెల్లింపు. స్పైస్ జెట్ ప్రస్తుత ప్రమోటర్లు అయిన అజయ్ సింగ్ అతని కుటుంబం 243 కోట్ల రూపాయలను కోర్టులో జమ చేయాలని, ఈ తీర్పును విస్మరించరాదని ఆదేశించింది. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో స్పైస్‌జెట్ యాజమాన్యం విఫలమైతే మారన్ మరియు అతని కంపెనీ స్పైస్ జెట్ వాటాపై యథాతథ స్థితిని కోరుతూ వారి అభ్యర్ధనను పునరుద్ధరించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.

  కోర్టు తీర్పుపై స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ "మేము కోర్టు ఉత్తర్వులను సమీక్షిస్తున్నాం" అని అన్నారు. కాగా, తీర్పుపై సన్ గ్రూప్ గ్రూప్ సిఎఫ్ఓ ఎస్ఎల్ నారాయణన్ మాట్లాడుతూ “స్పైస్ జెట్ తన ఒప్పంద బాధ్యతలను ఉల్లంఘించింది. అందువల్ల మా ప్రయోజనాలను కాపాడుకోవడానికి చట్టపరమైన పరిష్కారాలను కోరాల్సి వచ్చింది. గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుతో మాకు జరిగిన నష్టానికి పరిష్కారం లభించింది’’ అని పేర్కొన్నారు.

  మూడేళ్లుగా కొనసాగుతున్న కేసు

  మూడేళ్ల నుంచి కొనసాగుతున్న ఈ కేసులో తుది తీర్పు 2020 నవంబర్ 4న రానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2015లో మారన్ మరియు కెఏఎల్ ఎయిర్వేస్ స్పైస్‌జెట్లో 58.46 శాతం వాటాను పెట్టుబడిగా పెట్టారు. ఒప్పందంలో భాగంగా, వారెంట్ మరియు ప్రిఫరెన్స్ షేర్లను జారీ చేసినందుకు స్పైస్‌జెట్‌కు రూ .679 కోట్లు చెల్లించినట్లు మారన్, కెఎఎల్ ఎయిర్వేస్ తెలిపింది. అయినప్పటికీ యాజమాన్యం కన్వర్టిబుల్ వారెంట్లు, ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయలేదని, డబ్బు తిరిగి ఇవ్వలేదని మారన్ 2017లో అజయ్ సింగ్, స్పైస్‌‌జెట్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తనకు మరియు కెఎఎల్ ఎయిర్‌వేస్‌కు వారెంట్లు జారీ చేయనందుకు రూ. 1,323 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్న మారన్ వాదనను జూలై 2018 లో ఒక మధ్యవర్తిత్వ ప్యానెల్ తిరస్కరించింది.

  ఐతే అప్పటికే స్పైస్‌జెట్ యాజమాన్యం మారన్‌కు 579 కోట్ల రూపాయల పెట్టుబడిని మరియు వడ్డీని మాత్రం చెల్లించింది. 329 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి, మిగిలిన రూ .250 కోట్ల నగదు డిపాజిట్ చేయడానికి స్పైస్ జెట్ అంగీకరించింది. దీనికి ఒప్పుకోని మారన్ తన నష్టపరిహారాన్ని తిరస్కరించడమే కాక, స్పైస్‌జెట్‌పై ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. మారెన్‌కు చెల్లించాల్సిన 579 కోట్ల రూపాయలలో మొత్తం రూ.308 కోట్లు మాత్రమే వచ్చాయని మారెన్ తరపు న్యాయవాది తెలిపారు. ఇందులో 250 కోట్ల రూపాయల నగదు డిపాజిట్, బ్యాంక్ గ్యారెంటీ నుండి 58 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. అయితే 2020 జూన్ 20 నాటికి అజయ్‌ సింగ్, అతని కుటుంబం 59.93 శాతం స్పైస్‌జెట్‌లో వాటా కలిగి ఉంది. కాగా, మారన్ వైమానిక సంస్థ నుండి నిష్క్రమించే ముందు అజయ్ సింగ్ కేవలం 2 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, SpiceJet

  ఉత్తమ కథలు