దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai), వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ(Company)కి చెందిన 70 వేలకు పైగా వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని నిర్ణయించింది. తమ వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికే హ్యుందాయ్ మోటార్ ఈ నిర్ణయం తీసుకుంది. హ్యుందాయ్ కంపెనీ 70,000 కంటే ఎక్కువ వాహనాలను రీకాల్ చేయనుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (Transport Ministry) గురువారం తెలిపింది. ఎక్స్‌సియంట్ క్యూజెడ్ (Xcient QZ) హెవీ డ్యూటీ ట్రక్, కౌంటీ బస్సు (County bus)తో పాటు ఆరు మోడళ్లకు చెందిన 70,582 యూనిట్లను హ్యుందాయ్ రీకాల్ చేస్తున్నట్లు భూ, మౌలిక సదుపాయాలు, రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
హ్యుందాయ్ కంపెనీతో పాటు ప్రముఖ కార్ల(Car) తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్(Mercedes Benz) కొరియా కూడా తన ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేయడానికి సిద్ధమైంది. ఈ జర్మన్ కంపెనీ EQE 350+, EQS 450+ ప్యూర్ ఎలక్ట్రిక్ సెడాన్‌లతో సహా ఐదు మోడళ్ల 438 యూనిట్లను రీకాల్ చేయడానికి సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం హ్యుందాయ్ తన ఎక్స్‌సియంట్ క్యూజెడ్ ట్రక్‌లో ఆల్టర్నేటర్ కాంపోనెంట్‌లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్య వల్ల పవర్ ఔటేజ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ ట్రక్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. మెర్సిడెస్-బెంజ్ EQS 450+ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ కారులో పింటిల్ హుక్ (Pintle hook)లో ఒక ఉందని ఆ కంపెనీ కూడా వీటిని రీకాల్ చేయనుంది.
గతంలో చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు కూడా రీకాల్స్ బాట పట్టాయి. అంతకంటే ముందు సంవత్సరాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీలు కూడా వాహనదారుల శ్రేయస్సు కొరకు వాహనాలను రీకాల్ చేశాయి. ఈ కంపెనీలు ఫ్యూయల్ పంప్‌లు, ఎయిర్‌బ్యాగ్‌ల్లో లోపాలు, క్వాలిటీ చెక్ మిస్సయిన వాహనాలను రీకాల్ చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Hyundai, Kia cars, Mercedes-Benz