హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Fund Ratios: మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? వీటి గురించి తప్పక తెలుసుకోండి..

Mutual Fund Ratios: మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? వీటి గురించి తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mutual Fund Ratios: కొద్దిపాటి మార్కెట్ రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధపడే పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్‌ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేసేముందు కొన్ని కీలక విషయాలు మీరు తెలుసుకోవాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొద్దిపాటి మార్కెట్ రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధపడే పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్‌ (Mutual Funds) బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. అయితే వీటిలో ఇన్వెస్ట్ (Invest) చేసేముందు అసలు ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి నుంచి రాబడి ఎలా వస్తుందనే వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే బడ్జెట్‌(Budget), ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కీలక అంశం.. ఫండ్స్‌ రేషియోలు (Funds Ratios). మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో వీటి పాత్ర ప్రధానమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై సీఎన్‌బీసీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు ఫ్లెక్సీ క్యాపిటల్‌ మేనేజింగ్ పార్ట్నర్ నాజర్ సలీమ్. స్టాండర్డ్ డివియేషన్, షార్ప్ రేషియో, ఎక్స్‌పెన్స్ రేషియో వంటివి ఇన్వెస్టర్లు గమనించాల్సిన ప్రధాన విషయాలని తెలిపారు.

* షార్ప్ రేషియో (Sharpe Ratio)

ఇది ఫండ్‌కు సంబంధించిన రిస్క్ అడ్జెస్టెడ్ రిటర్న్‌ను కొలిచే మ్యూచువల్ ఫండ్ రేషియో. రిస్క్-ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ కంటే ఎక్కువ రిటర్న్‌ను ఫండ్ జనరేట్ చేస్తుందని షార్ప్ రేషియో సూచిస్తుంది. ప్రతి యూనిట్ రిస్క్ ప్రకారం ఫండ్స్ రిటర్న్ జనరేటింగ్ కెపాసిటీని ఈ రేషియో నిర్ణయిస్తుందని సలీమ్ వివరించారు.

* ఎక్పెన్స్ రేషియో (Expense Ratio)

మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేవారు కొన్ని ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజు, ఏజెంట్ల కమీషన్, రిజిస్ట్రార్ ఫీజులు, ఆడిటర్ ఫీజులు వంటివి ఈ జాబితాలో ఉంటాయి. ఈ ఖర్చుల నిర్వహణ కోసం ఫండ్ హౌస్ ఇన్వెస్టర్ల నుంచి ఫీజు వసూలు చేస్తుంది. దీన్నే ఎక్పెన్స్ రేషియో అంటారు. సెబీ ఈ నిష్పత్తికి పరిమితులను సెట్ చేసింది.

అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) ఎక్కువగా ఉంటే, ఎక్పెన్స్ రేషియో తక్కువగా ఉండాలి. ఎక్పెన్స్ రేషియోను విడిగా చెల్లించరు. దీన్ని రోజువారీ NAV నుంచి తీసివేస్తారు. అందువల్ల ఫండ్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చినా, నెగిటివ్ రిటర్న్ ఇచ్చినా.. దీనితో సంబంధం లేకుండా ఎక్పెన్స్ రేషియో వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి :  ఈ బిజినెస్ ప్రారంభిస్తే ప్రభుత్వ సాయం.. లక్షల కొద్దీ సంపాదన.. ఎలానో ఓ లుక్కేయండి


* స్టాండర్ట్ డీవియేషన్ (Standard Deviation)

స్టాండర్ట్ డీవియేషన్ అనేది వోలటాలిటీని సూచిస్తుంది. ఇది ఫండ్లను ట్రాక్ చేసే ఒక ప్రధాన రేషియో. ఫండ్ స్టాండర్డ్ డీవియేషన్‌ను పర్ఫార్మెన్స్ రేషియోగా ఉపయోగించడానికి ఒకే వర్గానికి చెందిన రెండు మ్యూచువల్ ఫండ్లను పోల్చాలి. ఎక్కువ స్టాండర్డ్ డీవియేషన్ అధిక రాబడిని సూచిస్తుంది. అయితే తక్కువ విలువ మాత్రం రిస్క్, రిటర్న్ రెండూ తక్కువగా ఉన్నట్లు సూచిస్తుందని సలీమ్ తెలిపారు.

* అవగాహన కోసమే

అయితే ఈ నిష్పత్తులను ఫండ్ల రాబడికి కచ్చితమైన కొలమానాలుగా చెప్పలేమంటున్నారు సలీమ్. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాల కోసం తప్పనిసరిగా ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ లేదా ఇతర నిపుణులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఫండ్ల విషయంలో రిస్క్ అడ్జెస్టెడ్ రిటర్న్‌ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ రేషియోలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Investments, Mutual Funds, Personal Finance

ఉత్తమ కథలు