Car Offers | ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న నిస్సాన్ (Nissan) ఇండియా తాజాగా తన ఎస్‌యూవీ కార్లపై కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. మ్యాగ్నైట్, కిక్స్ కార్లపై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు మార్చి నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి. అంతేకాకుండా కంపెనీ స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్ కూడా అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటుతో లోన్ (Loan) పొందొచ్చు. ఈ రెండు మోడళ్లకు ఈ ఫైనాన్స్ స్కీమ్ వర్తిస్తుంది.
నిస్సాన్ మ్యాగ్నైట్ కారుపై గరిష్టంగా రూ. 90 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 20 వేల వరకు తగ్గింపు వస్తుంది. ప్రిమెయింటెనెన్స్ ప్యాకేజీ రూ. 12,100 వరకు ఉచితంగా లభిస్తుంది. క్యాష్ లేదా యాక్ససిరీస్ డిస్కౌంట్ రూ. 20 వేల వరకు ఉంటుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 15 వేల వరకు ఉంది. లాయల్టీ బోనస్ కింద రూ. 10 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ రూ. 2 వేలు లభిస్తుంది. ఇలా వీటన్నింటినీ కలుపుకుంటే ఈ కారుపై ఏకంగా రూ. 90,100 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
150 కి.మి రేంజ్, బడ్జెట్ ధరలో లభించే 8 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ.59 వేల నుంచి..
ఈ కారుపై 6.99 శాతం వడ్డీ రేటుతో మీరు లోన్ పొందొచ్చు. 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. దీని ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ. 10.94 లక్షల వరకు ఉంది. కాగా ఈ ఆఫర్లు అనేవి మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అలాగే ప్రాంతం, డీలర్‌షిప్ ప్రాతిపదికన కూడా ఆఫర్‌లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరలు తెలుసుకోండి.
షాక్.. రూ.3,500 పెరిగిన బంగారం ధర.. కొనే వారికి పట్టపగలే చుక్కలు!
అలాగే నిస్సాన్ ఇండియాకు చెందిన మరో కారు కిక్స్ మోడల్‌పై కడా భారీ తగ్గిపుం ఉంది. ఈ కారుపై మీరు ఏకంగా రూ. 59 వేల వరకు తగ్గింపు సొంత చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 30 వేల వరకు వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 19 వేల వరకు ఉంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 10 వేలు పొందొచ్చు. అంటే మొత్తంగా రూ. 59 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా కంపెనీ ఈ కారును డిస్‌కంటిన్యూ చేస్తోంది. ఎందుకంటే దీని అమ్మకాలు సున్నా. ఈ కారుపై లోన్ ఫెసిలిటీ ఉంది. దీని ధర రూ. 9.5 లక్షల నుంచి ఉంది. గరిష్ట ధర రూ. 14.9 లక్షలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Latest offers, Offers