Home /News /business /

DEALERS BODY WANTS GOVERNMENT TO SLASH GST ON TWO WHEELERS TO 18 PERCENT PVN VB

Budget 2022: బడ్జెట్ 2022.. ద్విచక్ర వాహన ధరలు తగ్గనున్నాయా..?

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : PTI)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : PTI)

ఫిబ్రవరి-1న కేంద్ర బడ్జెట్ 2022-23ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్న సమయంలో తమ విజ్ఞప్తులు పరిశీలించాలని కోరుతూ ఆయా రంగాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా చదవండి ...
  ఫిబ్రవరి-1న కేంద్ర బడ్జెట్ 2022-23ను ఆర్ధిక మంత్రి(Finance Minister) నిర్మలా సీతారామన్ పార్లమెంట్(Parlament) లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్న సమయంలో తమ విజ్ఞప్తులు పరిశీలించాలని కోరుతూ ఆయా రంగాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆటోమొబైల్ డీలర్ల సంఘం(FADA)..ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను(GST Rates) నియంత్రించి, 18 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్ధించింది. 26,500 డీలర్‌షిప్‌లను(Dealership) కలిగి ఉన్న 15,000 మంది ఆటోమొబైల్ డీలర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA).. ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువు కాదని, అందువల్ల GST రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

  Tax On Billionaires: బిలియనీర్లపై భారీగా పన్ను..పేదలకు ఫ్రీగా వాక్సిన్.. ప్రభుత్వాలకు ఆక్స్‌ఫామ్ కీలక సూచన..


  ద్విచక్ర వాహనాలను విలాస వస్తువు కాదని, దూరప్రాంతాలకు వెళ్లేందుకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ రోజువారీ పని అవసరాలకు వినియోగిస్తారని FADA పేర్కొంది. అందువల్ల లగ్జరీ ఉత్పత్తులకు విధించే 28 శాతం GST + 2 శాతం సెస్ విధానం ద్విచక్ర వాహన కేటగిరికి మంచిది కాదని తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు మరియు అనేక ఇతర కారణాల వల్ల 3-4 నెలల విరామం తర్వాత వాహనాల ధరలు పెరుగుతున్న తరుణంలో, GST రేటు తగ్గింపు... ధరల పెంపును ఎదుర్కోవడంలో మరియు డిమాండ్‌ను పెంచడానికి సహాయపడుతుందని FADA తెలిపింది. డిమాండ్‌లో పెరుగుదల మరియు అనేక ఆధారపడిన రంగాలపై అది చూపే ప్రభావాలు పన్ను వసూళ్లను పెంచుతాయని FADA అభిప్రాయపడింది.

  Crisis: భారీ ఆర్థిక సంక్షోభంలో పొరుగు దేశం.. చుక్కలనంటిన ధరలతో విలవిల..


  వాస్తవానికి లాంగ్ టర్మ్ లో రాబడి సానుకూలంగా ఉంటుందని, మొత్తం వినియోగదారు సెంటిమెంట్‌లో,అదేవిధంగా మొత్తం ఆర్థిక వ్యవస్థలో సానుకూలతను తీసుకురావడంలో సహాయపడుతుందని తెలిపింది. ప్రభుత్వం, డీలర్లు మరియు వాహన యజమానులకు విజయవంతమైన పరిస్థితిని( win-win situation) సృష్టించడానికి..అన్ని ఉపయోగించిన వాహనాలకు( used vehicles)మార్జిన్‌పై 5 శాతం ఏకరీతి GST రేటును కూడా FADA కోరింది. GST తగ్గింపుతో... పరిశ్రమ అసంఘటిత విభాగం నుండి వ్యవస్థీకృత విభాగానికి మారడానికి సహాయపడుతుంది, తద్వారా పన్ను లీకేజీలకు బ్రేక్ వేయడానికి GST పరిధిలోకి మరింత వ్యాపారాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని తెలిపింది.

  Covid-19 Treatment: గుడ్ న్యూస్.. కోవిడ్ చికిత్సకు రెండు కొత్తమందులు.. డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గదర్శకాలివే..


  ప్రభుత్వం ప్రస్తుతం.. ఉపయోగించిన కార్లపై 12 మరియు 18 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేస్తోంది. 4,000 మి.మీ లోపు కార్లకు 12 శాతం జీఎస్టీ, 4,000 మి.మీ కంటే ఎక్కువ ఉన్న వాహనాలకు 18 శాతం పన్ను విధిస్తోంది ప్రభుత్వం. ఉపయోగించిన కార్ల వ్యాపారం కొత్త కార్ మార్కెట్ కంటే 1.4 రెట్లు ఆక్రమించింది, ఇది రూ. 1.75 ట్రిలియన్ల టర్నోవర్‌తో సంవత్సరానికి 5-5.5 మిలియన్ కార్లను కలిగి ఉంది. ఈ వ్యాపారంలో అధీకృత లేదా ఆథరైజ్డ్ డీలర్ల వాటా 10-15 శాతం మాత్రమే అని FADA పేర్కొంది. 400 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించిందని FADA ఈ సందర్భంగా గుర్తుచేసింది.

  ఆటో డీలర్‌షిప్ కమ్యూనిటీలోని చాలా మంది వ్యాపారులు ఈ కేటగిరీలో ఉన్నందున అదే ప్రయోజనం అన్ని LLP, యాజమాన్య మరియు భాగస్వామ్య సంస్థలకు కూడా విస్తరించబడాలని FADA పేర్కొంది. 50 లక్షల మందికి ఉపాధి కల్పించే వ్యాపారుల మనోధైర్యం మరియు సెంటిమెంట్‌ను పెంపొందించడానికి ఇది సహాయం చేస్తుంది అని FADA పేర్కొంది. ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అభ్యర్థిస్తోంది. 2022-23 బడ్జెట్ లో 'తరుగుదల పథకం(Depreciation Scheme)ని మళ్లీ ప్రవేశపెట్టాలని FADA ప్రభుత్వాన్ని కోరింది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Budget 2022, Business, Nirmala sitharaman, Two wheeler, Union Budget 2022

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు