హోమ్ /వార్తలు /బిజినెస్ /

Demat Nomination: ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్‌ నామినేషన్స్‌కు గడువు పెంపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే?

Demat Nomination: ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్‌ నామినేషన్స్‌కు గడువు పెంపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే?

సెబీ (ప్రతీకాత్మక చిత్రం)

సెబీ (ప్రతీకాత్మక చిత్రం)

సెబీ డీమ్యాట్ అకౌంట్‌ హోల్డర్లకు ఓ లేటెస్ట్‌ అప్‌డేట్‌ అందించింది. నామినేషన్‌ లేదా డిర్లరేషన్‌ ఫారం అందించేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Demat Nomination: ప్రస్తుతం ఎక్కువ మందికి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌లు(Investment options) అందిస్తున్నది స్టాక్‌మార్కెట్‌(Stock market). వివిధ కంపెనీల షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటివి కొనుగోలు చేయాలంటే డీమ్యాట్‌ అకౌంట్‌(Demat account) తప్పనిసరి. ఇంతకు ముందు మార్చి 31లోపు అర్హులైన ట్రేడింగ్‌, డీమ్యాట్‌ అకౌంట్‌ హోల్డర్‌లు నామినేషన్‌ ప్రాసెస్‌ పూర్తి చేయాలని సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించిన విషయం తెలిసిందే. నామినీగా ఎవరూ వద్దనుకుంటే, అందుకు డిక్లరేషన్‌ ఫారం అందజేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే సెబీ డీమ్యాట్ అకౌంట్‌ హోల్డర్లకు ఓ లేటెస్ట్‌ అప్‌డేట్‌ అందించింది. నామినేషన్‌ లేదా డిర్లరేషన్‌ ఫారం అందించేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

* అకౌంట్‌ బ్లాక్‌ అయ్యే ప్రమాదం

అర్హులైన ట్రేడింగ్‌, డీమ్యాట్‌ అకౌంట్‌ హోల్డర్‌లు నామినేషన్ వివరాలను తప్పక సమర్పించాలని గతేడాది జూన్ 15న సెబీ ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. నామినేషన్ సెలక్ట్‌ చేయని వారి ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్‌ బ్లాక్‌ అవుతాయని, డెబిట్స్‌ జరగవని తెలిపింది. అంతే కాదు మార్కెట్‌ను పర్యవేక్షిస్తున్న రెగ్యులేటరీ బాడీ స్టాక్‌బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్‌లు తమ క్లయింట్‌లను వారి "ఛాయిస్‌ ఆఫ్‌ నామినేషన్"ని ఎంచుకోవాలని అప్రమత్తం చేయాలని సూచించింది. రెండు వారాల షెడ్యూల్‌లో SMS లేదా ఇమెయిల్ రిమైండర్‌లను పంపడం ద్వారా అప్‌డేట్ చేయాలని కోరింది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే డీమ్యాట్‌ అకౌంట్‌లు లాక్‌ అవుతాయని, ఫండ్స్‌ను తిరిగి పొందే అవకాశం ఉండదని హెచ్చరించింది.

గతంలో తమ నామినేషన్ వివరాలను సమర్పించిన ట్రేడింగ్‌, డీమ్యాట్‌ అకౌంట్‌ హోల్డర్‌లు మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే, ఇంకా తమ నామినేషన్ వివరాలను సమర్పించని, వాటిని సమర్పించాలనుకునే వారు లేదా నామినేషన్ ప్రక్రియ నుంచి తొలగించాలనుకునే వారికి అవకాశం ఉంది.

ITR Filing: ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోగా ఫైల్‌ చేయాలి? ఐటీఆర్ ఫారమ్స్ ఎన్ని రకాలు..?

* ఆన్‌లైన్‌ సదుపాయం

స్టాక్ బ్రోకర్లు లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్లు అందించే ట్రేడింగ్ ప్లాట్‌ఫారంలలో నామినేషన్‌లను సమర్పించడానికి లేదా ఉపసంహరించుకోవడానికి పెట్టుబడిదారులు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ ఉపయోగించవచ్చు. ఇంతకు ముందు అవసరమైన మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID, మైనర్ నామినీల నామినీ లేదా గార్డియన్‌ ఐడెంటిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు ఆప్షనల్‌. అకౌంట్‌ హోల్డర్‌ సంతకం చేసిన డిక్లరేషన్ ఫారం ఇప్పటికీ అవసరం.

నామినేషన్ లేదా డిక్లరేషన్ ఫారంలను ఇ-సైన్ ఫెసిలిటీ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. ఇ-సైన్ ఫెసిలిటీని అందించడానికి తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా స్టాక్ బ్రోకర్లు లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్లు చర్యలు తీసుకోవాలి. క్లయింట్ రికార్డులకు ప్రైవసీ, సెక్యూరిటీ అందించాలి. అకౌంట్‌ హోల్డర్‌ సంతకానికి బదులుగా బొటనవేలు ముద్రను ఉపయోగిస్తే తప్ప సాక్షి సంతకం అవసరం లేదు.

First published:

Tags: Demat Account, Sebi