Fixed Deposit | బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన డీసీబీ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. సేవింగ్స్ అకౌంట్ (Bank Account), ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. దీంతో బ్యాంక్ (Bank) కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై డిపాజిట్లపై అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ తాజా రూ. 2 కోట్లకు లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది.
బ్యాంక్ ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లపై గరిష్టంగా 8 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. రెగ్యలర్ కస్టమర్లకు 8 శాతం వరకు, సీనియర్ సిటిజన్స్‌కు 8.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చిందని బ్యాంక్ వెల్లడించింది. సేవింగ్స్ ఖాతాలపై, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.200 పొదుపుతో రూ.2 కోట్లు వెనకేయండిలా!
రూ. లక్ష వరకు బ్యాలెన్స ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటు 2.25 శాతంగా ఉంది. అలాగే రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డ రేటు 4 శాతంగా ఉంటుంది. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. ఇక రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు 6 శాతంగా లభిస్తుంది. ఇంకా రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే.. 7 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.
మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర తెలిస్తే మీ ఫ్యూజుల్ ఔట్, కొత్త కారు కొనొచ్చు!
ఇక రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే 5.5 శాతం వడ్డీ వస్తుంది. రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే 7 శాతం వడ్డీ పొందొచ్చు. రూ. 10 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. రూ. 200 కోట్లకు పైన బ్యాలెన్స్ ఉంటే 5 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఎఫ్‌డీ రేట్ల విషయానికి వస్తే.. 15 నెలల నుంచి 24 నెలల వరకు టెన్యూర్‌లోని డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతంగా లభిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.5 శాతం వడ్డీ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank news, Banks, FD rates, Fixed deposits