• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DATSUN INDIA OFFERING DISCOUNTS OF UPTO RS 45000 ON REDI GO GO AND GO TILL NOVEMBER 30 NS GH

Datsun Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఆ కంపెనీ కార్లపై భారీ ఆఫర్లు.. వివరాలివే..

Datsun Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఆ కంపెనీ కార్లపై భారీ ఆఫర్లు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

డాట్సన్ Redi-GO, Datsun GO, Datsun GO+ వాహనాలపై వినియోగదారులు తగ్గింపులు పొందవచ్చు. డాట్సన్ సంస్థ ఈ మూడు వేరియెంట్లపై వివిధ రకాల డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్, ఈయర్ ఎండ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, వైద్య నిపుణుల కోసం స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్లు వంటివి ఉన్నాయి.

  • Share this:
డాట్సన్ Redi-GO, Datsun GO, Datsun GO+ వాహనాలపై వినియోగదారులు తగ్గింపులు పొందవచ్చు. డాట్సన్ సంస్థ ఈ మూడు వేరియెంట్లపై వివిధ రకాల డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్, ఈయర్ ఎండ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, వైద్య నిపుణుల కోసం స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్లు వంటివి ఉన్నాయి. కరోనావైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మహమ్మారి ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలను కూడా కోల్పోయారు. దీంతో డబ్బు ఆదా చేసే ధోరణి పెరిగింది. దీని ఫలితంగా ట్రావెల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనాకు ముందే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తిరోగమనంలో ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కార్ల అమ్మకాలు తగ్గాయి. దీనికి COVID-19 తోడవ్వడంతో వ్యాపారాలు మరింత క్షీణించాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో జపాన్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ భారత్‌లో అమ్మకాలను పెంచుకునే ఏర్పాట్లు చేస్తోంది.

తాజాగా వివిధ మోడళ్లపై ఆ సంస్థ డిస్కౌంట్లను ప్రకటించింది. నవంబర్ 30 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మోడళ్లు, స్టాక్‌ను బట్టి డిస్కౌంట్ మారవచ్చు. డాట్సన్ Redi-GO, Datsun GO, Datsun GO+ వాహనాలపై వినియోగదారులు తగ్గింపులు పొందవచ్చు. డాట్సన్ సంస్థ ఈ మూడు వేరియెంట్లపై వివిధ రకాల డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్, ఈయర్ ఎండ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, వైద్య నిపుణుల కోసం స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్లు వంటివి ఉన్నాయి.

Datsun Redi-GO
ఈ కారు కొనుగోలుపై వినియోగదారులు రూ.7,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.11,000 వరకు ఈయర్ ఎండ్ బెనిఫిట్ పొందవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి రెడీ గో మోడల్‌పై డాట్సన్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వైద్య నిపుణులు ఈ మోడల్ కారు కొనుగోలుపై రూ.5,000 అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Datsun GO
ఈ మోడల్‌పై వైద్య నిపుణులకు ఎలాంటి అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ లభించదు. కొనుగోలుదారులు రూ.20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్, అంతే మొత్తంలో ఎక్సేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు రూ.11,000 ఈయర్ ఎండ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Datsun GO+
డాట్సన్ GO ప్లస్ మోడల్‌ కారు కొనుగోలుపై రూ.11,000 వరకు ఈయర్ ఎండ్ డిస్కౌంట్‌ లభిస్తుంది. డాట్సన్ GO వేరియెంట్ మాదిరిగానే Datsun GO+ కారుపై వైద్య నిపుణులకు అదనంగా ఎలాంటి కార్పొరేట్ డిస్కౌంట్ ఉండదు. దీని కొనుగోలుపై రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంటుందని డాట్సన్ ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published: