హోమ్ /వార్తలు /బిజినెస్ /

Railways: దసరా ఎఫెక్ట్.. రైల్వే ప్రయాణికులకు షాక్!

Railways: దసరా ఎఫెక్ట్.. రైల్వే ప్రయాణికులకు షాక్!

రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. చార్జీలు రెట్టింపు!

రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. చార్జీలు రెట్టింపు!

Platform Ticket Price Hike | రైల్వే ప్రయాణికులు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. రైల్వేస్ తాజాగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను భారీగా పెంచేసింది. దసరా పండుగ నేపథ్యంలో రైల్వేస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Indian Railways | దసరా (Dasara) పండుగ సీజన్‌ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే (Railways) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫామ్ టికెట ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. రూ.10గా ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ. 20 చేసేసింది. అంటే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేసిందని చెప్పుకోవచ్చు.

  మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. దసరా అనేది చాలా పెద్ద పండుగ. చాలా మంది ఊళ్లకు వెళ్తుంటారు. దీని వల్ల ప్లాట్‌ఫామ్స్‌పై రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రైల్వేస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాట్‌ఫామ్స్‌పై రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను పెంచేసింది.

  సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

  కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని గుర్తించుకోవాలి. ఈ చార్జీల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. అక్టోబర్ 9 వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల పెంపు నిర్ణయం అమలులో ఉంటుంది. పండుగ సీజన్‌లో ప్లాట్‌ఫామ్స్‌పై రద్దీని తగ్గించేందుకు, ప్యాసింజర్లకు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేస్ తెలిపింది.

  దసరా ముందు కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. 5 బ్యాంకుల కీలక నిర్ణయం!

  ‘ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచాం. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దసరా పండుగ సందర్భంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.20 చేశాం. 2022 అక్టోబర్ 9 వరకు పెంపు అమలులో ఉంటుంది. అందువల్ల రైల్వే ప్రయాణికులకు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలి’ అని దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. కాగా మరోవైపు సంక్రాంతికి ఊరు వెళ్లాలని భావించే వారు ఇప్పటి నుంచే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సంక్రాంతి టికెట్ బుకింగ్ విండో ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అందువల్ల ఊరు వెళ్లాలని ప్లాన్ చేసే వారు ఆలస్యం చేయకుండా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.లేదంటే చివరిలో ఇబ్బంది పడాల్సి రావొచ్చు. టికెట్లు కన్ఫార్మ్ కాకపోవచ్చు. వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండొచ్చు. అందుకే ఇప్పుడే బుక్ చేసుకోండి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: India Railways, Railways, South Central Railways, Train

  ఉత్తమ కథలు