హోమ్ /వార్తలు /బిజినెస్ /

Festive Offers: దసరాకు బైక్, స్కూటర్ కొనే వారికి ఆఫర్ల వర్షం! భారీ డిస్కౌంట్లు!

Festive Offers: దసరాకు బైక్, స్కూటర్ కొనే వారికి ఆఫర్ల వర్షం! భారీ డిస్కౌంట్లు!

దసరాకు కొత్త బైక్, స్కూటర్ కొనే వారికి ఆఫర్ల వర్షం! భారీ డిస్కౌంట్లు!

దసరాకు కొత్త బైక్, స్కూటర్ కొనే వారికి ఆఫర్ల వర్షం! భారీ డిస్కౌంట్లు!

Dasara Offers | బైక్ కొనేందుకు సిద్ధం అయ్యారా? లేదంటే స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. దసరా సందర్భంగా పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Hero Offers | పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. దసరా పండుగు వచ్చేసింది. పండుగకు కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తగ్గింపుతో పాటుగా ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్స్ లభిస్తున్నాయి. బైక్ (Bike), స్కూటర్ (Scooter) కొనుగోలుకు ఇది వర్తిస్తుంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ అయిన హీరో (Hero Motocorp)మోటొకార్ప్ కొనుగోలుదారుల కోసం పలు రకాల ఆఫర్లు అందిస్తోంది.

  హీరో కంపెనీ అందిస్తున్న పండుగ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు రూ. 5 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్ పేరుతో హీరో మోటొకార్ప్ ఈ ఫెస్టివ్ ఆఫర్లు అందిస్తోంది. కంపెనీ రిటైల్ బెనిఫిట్స్‌తో పాటుగా ఫైనాన్స్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంచింది. ఇవి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు. అక్టోబర్ 5 వరకే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి.

  గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంక్‌లో బంపరాఫర్లు.. మహిళలకు ప్రత్యేక తగ్గింపు!

  హెచ్ఎఫ్‌ డీలక్స్, స్ల్పెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో, గ్లామర్ వంటి బైక్స్‌పై రూ. 2,100 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. స్కూటర్లపై ఈ బెనిఫిట్ పొందొచ్చు. రూ. 3 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. ప్లెజర్ ప్లస్, మ్యాస్ట్రో ఎడ్జ్, డెస్టినీ 125 వంటి పలు మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే హీరో స్కూటర్లపై సూపర్ సిక్స్ ధమాకా ప్యాకేజ్ పొందొచ్చు. అంటే ఇందులో ఏడాది ఇన్సూరెన్స్, రెండళ్ల ఫ్రీ మెయింటెనెన్స్, రూ. 3 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 4 వేల గుడ్ లైఫ్ గిఫ్ట్ వోచర్లు, ఐదేళ్ల వారంటీ, ఆరు నెలల ఈఎంఐ (వడ్డీ లేకుండా) వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. మొత్తంగా కస్టమర్లకు రూ. 13,500 వరకు ప్రయోజనం పొందొచ్చు.

  కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రూ.50 వేలు జరిమానా, ఏడాది జైలు శిక్ష!

  కంపెనీ ప్రీమియం మోటార్ సైకిళ్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 200, ఎక్స్2ట్రీమ్ 200ఎస్ వంటి వాటిపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 5 వేలు ఉంది. హీరో మోటొకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రన్జీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. పండుగ సంబరాలను రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో కొత్త ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇకపోతే దసరా సందర్భంగా ఇతర కంపెనీలు కూడా టూవీలర్లపై ఆఫర్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. అందువల్ల బైక్ , స్కూటర్ కొనే ముందు ఏ ఏ ఆఫర్లు ఉన్నాయో  ముందే తెలుసుకోవడం ఉత్తమం.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bike, Hero moto corp, Latest offers, SCOOTER

  ఉత్తమ కథలు