Home /News /business /

DARWIN GROUP LAUNCHES THREE NEW ELECTRIC SCOOTERS IN INDIA MK

Darwin EVAT : ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల మైలేజ్...అంటే జస్ట్ 10 రూపాయల ఖర్చు మాత్రమే..

ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో, డార్విన్ (Darwin) EVAT ఏకకాలంలో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్ల విశేషమేమిటంటే, వీటిలో కస్టమర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ. తిరగవచ్చు. దీని ధర , ఇతర ఫీచర్లను తెలుసుకోండి.

ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో, డార్విన్ (Darwin) EVAT ఏకకాలంలో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్ల విశేషమేమిటంటే, వీటిలో కస్టమర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ. తిరగవచ్చు. దీని ధర , ఇతర ఫీచర్లను తెలుసుకోండి.

ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో, డార్విన్ (Darwin) EVAT ఏకకాలంలో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్ల విశేషమేమిటంటే, వీటిలో కస్టమర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ. తిరగవచ్చు. దీని ధర , ఇతర ఫీచర్లను తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో, డార్విన్ (Darwin) EVAT ఏకకాలంలో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్ల విశేషమేమిటంటే, వీటిలో కస్టమర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ. తిరగవచ్చు. దీని ధర , ఇతర ఫీచర్లను తెలుసుకోండి. డార్విన్ (Darwin)EVAT 3 బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు D5, D7 , D14లను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ఈ స్కూటర్లను విడుదల చేశారు. ఈ మూడు స్కూటర్ల తయారీకి జపాన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది.

    బ్యాటరీ మార్పిడి చేయవచ్చు

    డార్విన్ (Darwin), ఈ స్కూటర్లలో బ్యాటరీ స్వాప్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కంపెనీకి చెందిన ఈ స్కూటర్లు వెస్పా స్కూటర్‌ల మాదిరిగానే మస్కులర్ డిజైన్‌తో ఉంటాయి. వివిధ వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్లను రూపొందించారు. వీటిలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే వినియోగదారుడు 70 కి.మీ నుండి 120 కి.మీల పరిధిని పొందుతాడు.

    ఇవి చదవండి.. Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...



    డార్విన్ (Darwin)స్కూటర్ల ధర ఎంత?

    కంపెనీ తన మూడు స్కూటర్లను రూ. 1 లక్ష లోపు రేంజ్‌లో విడుదల చేసింది. ఢిల్లీలో వాటి ఎక్స్-షోరూమ్ ధర రూ.68,000 నుండి రూ.86,000 వరకు ఉంది. ఇవి మేడ్ ఇన్ ఇండియా స్కూటర్లు , కంపెనీ వాటి ఉత్పత్తి కోసం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.\

    ఇవి చదవండి.. Top electric scooters in india 2021: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..టాప్ 5 చాయిస్ ఇవే...

    ఇదిలా ఉంటే, సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)... ఈ నెలాఖరులో మరిన్ని నగరాలకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్ సదుపాయాన్ని విస్తరించనుంది. నవంబర్ 27 నుంచి మరిన్ని నగరాల్లో టెస్ట్ రైడ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ సంస్థ Ola S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వీటి కోసం మలి విడత టెస్ట్ రైడ్ పాయింట్‌లను సూరత్, తిరువనంతపురం, కోజికోడ్, విశాఖపట్నం, విజయవాడ, కోయంబత్తూర్, వడోదర, భువనేశ్వర్, తిరుప్పూర్, జైపూర్, నాగ్‌పూర్ నగరాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.  ఈ నెల ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్.. దేశంలోని కొన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం టెస్ట్ రైడ్‌ను ప్రారంభించింది. నవంబర్ 10న బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతాలో S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ల టెస్ట్ రైడ్‌లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నవంబర్ 19న ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, పూణేలో ప్రారంభమయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్‌1, ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో ఈ-మార్కెట్లో అడుగుపెడుతున్నట్లు గతంలో ప్రకటించింది. ఆగస్టు 15న ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌ల కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ను సంస్థ ఓపెన్ చేయగా.. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. కొనుగోలుదారులు ఒక్కో స్కూటర్‌ను రూ.499కి రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Electric Bikes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు