ఇండియాలో లాంచ్ అయిన Daiwa 43-inch D43QFS స్మార్ట్ టీవీ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ అనేది డైవా స్మార్ట్ టీవీ ప్రత్యేకత. మ్యూజిక్, వెదర్, న్యూస్ అప్ డేట్స్, అలారం, రిమైండర్స్ వంటివన్నీ స్పీచ్ కమాండ్ ద్వారా చెబితే ఈస్మార్ట్ టీవీ ఇట్టే తన పని చేసేస్తుంది. 32 ఇంచులు, 39 ఇంచుల HD Ready వేరియంట్ ను కూడా మరికొన్ని వారాల్లో లాంచ్ చేయనున్నట్టు డైవా ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్ అలెక్సాకు కనెక్ట్ అయిన స్మార్ట్ ఏసీ వంటి డివైజులన్నీ ఈ స్మార్ట్ టీవీ అలో చేస్తుంది.
Daiwa 43-Inch D43QFS smart TV స్పెసిఫికేషన్స్
Daiwa 43-Inch D43QFS smart TV స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే తో (1920X1080 pixels resolution) విత్ క్వాంటమ్ లిమినిట్ టెక్నాలజీ, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్ తో స్పష్టమైన, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ఔట్ పుట్ సపోర్ట్ చేసేలా ఈ స్మార్ట్ టీవీ ఉంటుంది. డెడికేటెడ్ క్రికెట్, సినిమా పిక్చర్ మోడ్స్ లో 20W స్టీరియో బాక్స్ స్పీకర్స్ విత్ సరౌండ్ సౌండ్ తో మంచి వీవింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. A53 ప్రాసెసర్, 1GB RAM, 8GB స్టోరేజ్ తో ఈ టీవీ ఫీచర్లున్నాయి. ఆండ్రాయిడ్ 8.0 బేస్డ్ Big Wall UI స్మార్ట్ టీవీగా ఆకట్టుకునేలా మోడల్ ఉంది.
డెడికేటెడ్ బటన్స్
Daiwa 43-Inch D43QFS smart TV తో 25,00,000 గంటల పాటు క్లౌడ్ టీవీ కంటెంట్ సర్టిఫైడ్ యాప్స్ అయిన Disney + Hotstar,Eros Now,Vootతో పాటు ఇంకా బోలెడన్నీ యాప్స్ ను యాక్సెస్ చేసి, ప్లేచేయవచ్చు. Amazon Prime, Netflix,YouTube వంటివి సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ రిమోట్ తో వీటిని కంట్రోల్ చేయవచ్చు.
ఆటోమేటిక్ అప్ డేట్స్
వాయిస్ సర్చ్ సపోర్ట్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ ఎల్ఐవీ యాప్స్ వంటి వాటికి రిమోట్ పై డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఈజీ కంట్రోల్ కోసం మౌజ్ బటన్ కూడా ఉంది. Daiwa 43-Inch D43QFS smart TV కి ప్రత్యేకంగా కంటెంట్ డిస్కవరీ సర్చ్ ఇంజిన్ (CDE) తో పనిచేసే టీవీగా ఉండటంతో పాటు, ఈ స్మార్ట్ టీవీకి ఆటోమేటిక్ OTA అప్ డేట్స్ వస్తాయని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే 3 HDMI, రెండు USB పోర్ట్స్, బ్లూటూత్, స్క్రీన్ మిరరింగ్ కు సాయం చేసే E-Share వంటివన్నీ ఉన్నాయి.
Daiwa 43-Inch D43QFS smart TV ధర
Daiwa 43-inch D43QFS ఇంట్రడక్టరీ ఆఫర్ తో ప్రస్తుతం సేల్స్ జరుపుకుంటున్న డైవా స్మార్ట్ టీవీని కేవలం రూ.24,490లతో సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఆన్లైన్ స్టోర్ online store నుంచి లేదా రీటైల్ స్టోర్స్ తోపాటు ఈ కామర్స్ ప్లాట్ ఫారంలలో ఈ టీవీ అందుబాటులో ఉంది. కస్టమర్లు 'My Daiwa' యాప్ ద్వార్ బుక్ చేసుకుంటే ప్యానెల్ పై అదనంగా మరో ఏడాదిపాటు వారెంటీనీ పొందవచ్చు.