Home /News /business /

DA HIKE 7TH PAY COMMISSION CENTRAL GOVERMENT EMPLOYEES DEARNESS ALLOWANCE GETS DOUBLED AND HERE KNOW HOW MUCH SALARY TO INCREASE GH SRD

DA Hike 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పెరిగిన ఉద్యోగుల డీఏ.. జీతం ఎంత పెరుగుతుందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

DA Hike 7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రభుత్వ సిబ్బందికి జీతాలతో కలిపి 34 శాతం డీఏ లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం కేంద్రం వెల్లడించింది.

ఇంకా చదవండి ...
డీఏ 7వ వేతన సంఘం: కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉద్యోగులకు శుభవార్తను అందజేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 7వ వేతన సంఘం సూచనల మేరకు డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డియర్‌నెస్ రిలీఫ్‌(Dearness Relief)లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రభుత్వ సిబ్బందికి జీతాలతో కలిపి 34 శాతం డీఏ లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం కేంద్రం వెల్లడించింది.ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో..‘ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అడిషనల్‌ ఇన్‌స్టాల్‌మెంట్లను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 31 శాతం రేటు కంటే 3 శాతం పెరుగుదల అమలవుతుంది’ అని పేర్కొంది.

ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి కారణంగా ఖజానాపై సంవత్సరానికి రూ.9,544.50 కోట్ల భారం పడుతుందని పేర్కొంది.

దీనివల్ల దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఈ పెంపుదల జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

2020వ సంవత్సరం నుంచి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు కొవిడ్‌ మహమ్మారి ప్రభావం కారణంగా మాజీ సైనికులకు DA, DR పెంపును స్తంభింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బకాయిలు విడుదల చేయలేదు.

* 7వ వేతన సంఘం కింద డీఏ పెంపు: డియర్‌నెస్ అలవెన్స్ రెట్టింపు

7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములా ప్రకారం ఈ పెంపుదల ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుత సవరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతానికి పెరిగింది. జూలై 2021 వరకు డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతంగా ఉంది. అంటే గత ఆరు నెలల్లో సైనికులకు భత్యం రెట్టింపు చేయబడింది. జూలై తర్వాత ప్రభుత్వం 11 శాతం డీఏ పెంపును ప్రకటించింది, దానిని 28 శాతంగా చేసింది. ఆ తర్వాత 3 శాతం డీఏ పెంపును ప్రకటించింది.

* డీఏ పెంపు తర్వాత జీతం ఎంత పెరుగుతుంది?

తాజా పెంపు తర్వాత.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పొందుతారు. ఉద్యోగి మూల వేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా జీతం లెక్కిస్తారు. బేసిక్ పే రూ.18,000 ఉన్న ఉద్యోగి జీతాన్ని ఉదాహరణగా తీసుకొంటే.. అంతకుముందు 31 శాతం డీఏ చొప్పున, ఉద్యోగి రూ.5,580 డీఏ అందుకొంటారు. తాజా పెంపు తర్వాత ఉద్యోగికి రూ.6,120 డీఏ లభిస్తుంది. అంటే తాజాగా డీఏ పెంపు తర్వాత రూ.540 పెరిగింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో డీఏను పెంచుతుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Central govt employees, DA Hike, Salary Hike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు