Home /News /business /

CYBORG GT 120 ELECTRIC SPORTS BIKE WITH 125KMPH TOP SPEED 180KM RANGE LAUNCHED IN INDIA MK GH

Cyborg GT 120: త్వరలోనే మార్కెట్​లోకి సైబోర్గ్​ జీటీ 120 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ లాంచ్​.. స్టైలిష్​ లుక్​తో పాటు అదిరి?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్​ లిమిటెడ్​ అనే స్టార్టప్​ సంస్థ సైబోర్గ్ GT120 పేరుతో సరికొత్త హై స్పీడ్​ ఎలక్ట్రిక్ బైక్​ను లాంచ్​ చేసింది. కుర్రకారును ఆకట్టుకునేలా దీనిలో అధునాతన ఫీచర్లను అందించింది.

భారత మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది. ఓవైపు, పెట్రోల్, డీజిల్​ ధరలు, మరోవైపు పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ బాగా పెరిగింది. దీంతో, దిగ్గజ ఆటోమొబైల్​ కంపెనీలతో పాటు స్టార్టప్​ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. పోటీపోటీగా ఎలక్ట్రిక్​ వాహనాలను లాంచ్​ చేస్తున్నాయి. తాజాగా ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్​ లిమిటెడ్​ అనే స్టార్టప్​ సంస్థ సైబోర్గ్ GT120 పేరుతో సరికొత్త హై స్పీడ్​ ఎలక్ట్రిక్ బైక్​ను లాంచ్​ చేసింది. కుర్రకారును ఆకట్టుకునేలా దీనిలో అధునాతన ఫీచర్లను అందించింది. సైబోర్గ్​ జీటీ120 ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ బైక్​ ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

సైబోర్గ్ GT 120 ధర, లభ్యత, కలర్​ ఆప్షన్లు

సైబోర్గ్​ GT 120 ధర, బుకింగ్ వివరాలను వచ్చే నెలలో ప్రకటించనున్నట్లు ఇగ్నిట్రాన్​ మోటోకార్ప్​ లిమిటెడ్​ తెలిపింది. ఈ స్పోర్ట్స్​ బైక్​ బ్లాక్, పర్పుల్ అనే రెండు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలోని మోటార్​, బ్యాటరీ 5 సంవత్సరాల వారంటీని కలిగి ఉంటాయి.

సైబోర్గ్ GT 120 స్పెసిఫికేషన్లు

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో నడిచే సైబోర్గ్ GT 120 ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ బైక్ బుల్లెట్​ వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై గరిష్టంగా 125kmph వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్ కేవలం 2.5 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. సైబోర్గ్​ జీటీ 120 ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్ బైక్​​ 4.68kWhr లిథియం- అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది గరిష్టంగా 6kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని బ్యాటరీని 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 3 గంటలు, 100 శాతం ఛార్జ్​ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే ఏకంగా 180 కిలో మీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. కేవలం 5 గంటల సమయంలో 15A ఫాస్ట్ హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి దీనిలోని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. సైబోర్గ్ GT 120లోని కాంబి బ్రేక్ సిస్టమ్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, రీజెనరేటివ్ బ్రేకింగ్​ వంటివి అమర్చింది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లో జియో-ఫెన్సింగ్, జియో-లొకేషన్, యూఎస్​బీ ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి చేర్చింది. క్లస్టర్‌లో ఎల్​ఈడీ డిస్‌ప్లేను కూడా అందించింది. ఈ డిస్​ప్లేలో బ్యాటరీ లైఫ్​ను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. సైబోర్గ్ GT 120 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.- ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్​లలో అందుబాటులో ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Bikes, Electric bike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు