TAC Security: టీఏసీ కంపెనీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులే పని

ఫ్రతీకాత్మకచిత్రం

ఐటీ కంపెనీల్లో ప్రస్తుతం వారానికి 5 రోజుల పని విధానం అమల్లో ఉంది. ఇకపై వారానికి నాలుగు రోజుల పని విధానం వైపు కొన్ని కంపెనీలు మొగ్గ?

  • Share this:
సమీప భవిష్యత్తులో పని విధానంలో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే కరోనా పుణ్యమాని అన్ని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో కూడా కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ఉత్తమ ఫలితాలను రాబడుతున్నాయి. ఇదే తరహాలో కొన్ని కంపెనీలు పని గంటలు, పని రోజుల విషయంలో సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ప్రస్తుతం వారానికి 5 రోజుల పని విధానం అమల్లో ఉంది. ఇకపై వారానికి నాలుగు రోజుల పని విధానం వైపు కొన్ని కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సైబర్ సెక్యూరిటీ కంపెనీ టీఏసీ సెక్యూరిటీస్​ తమ ఉద్యోగులకు నాలుగు రోజుల పని విధానాన్ని ప్రతిపాదించింది.

Demat Account: మీ డీమ్యాట్‌ అకౌంట్‌ డీయాక్టివేట్ కాకుండా ఉండాలా ?.. వెంటనే ఇలా చేయండి


తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 200 మంది ఉద్యోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు శుక్రవారం సైతం వీక్​ ఆఫ్​ ఇవ్వాలని నిర్ణయించింది. ఆఫీసులో పనితీరు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాలపై ఇటీవల టీఏసీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందులో చాలా మంది ఆఫీసు జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్​ చేయడం కష్టంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వర్క్​ ఫ్రం హోమ్​తో ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుందని, తద్వారా పనిలో ఉత్సాహం, ఉత్తేజం లోపిస్తుందని వెల్లడించారు.

Online Shopping Tips: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో షాపింగ్... ఈ టిప్స్ గుర్తుంచుకోండి


లాంగ్ వీకెండ్​తో మరింత ఉత్సాహంగా పని..

ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా టీఏసీ యాజమాన్యం కొత్త ప్రతిపాదనలను వారి ముందు పెట్టింది. వారానికి ఐదు లేదా ఆరు రోజుల పని, రోజుకు ఎనిమిది గంటల పని విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. వారానికి నాలుగు రోజుల పని దినాలు, లాంగ్​ వీకెండ్​ ఉండేలా కొత్త టైం టేబుల్​ సిద్దం చేసింది. అయితే, వర్క్​ లోడ్​ను బట్టి 4 పని దినాల్లో 8 కంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలపింది. ఈ ప్రతిపాదనలకు దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు ఓకే చెప్పారు. దీంతో, వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పని విధానంపై TAC సెక్యూరిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & ఫౌండర్ త్రిష్నీత్ అరోరా మాట్లాడుతూ ‘‘వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉన్నప్పుడే ఉద్యోగుల నుంచి మంచి అవుట్​పుట్​ వస్తుంది. అందుకే వారంలో నాలుగు రోజుల పని విధానానికి శ్రీకారం చుట్టాం. లాంగ్​ వీకెండ్​లో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ కొత్త పని విధానంతో ఫలితాలు సానుకూలంగానే ఉంటాయని ఆశిస్తున్నాం.” అని అన్నారు. కాగా, ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ప్రయోగం తీరు తెన్నులను ఇతర ఐటీ దిగ్గజాలు పరిశీలిస్తున్నాయి. ఇది సక్సెస్​ అయితే ఇతర కంపెనీలు సైతం టీఏసీ తరహాలోనే నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published: