సైబర్ క్రైమ్‌ నుంచి కాపాడే ఇన్సూరెన్స్‌ పాలసీలివే!

సైబర్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే మీ పాలసీ కవరేజ్ ఎంత అన్నది మీ దగ్గరున్న డేటా, దాని ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. మీరు చేసిన తప్పిదాల వల్ల డేటా కోల్పోతే ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. అందుకే పాలసీ ఇచ్చే ముందే చెక్‌లిస్ట్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ.

news18-telugu
Updated: October 2, 2018, 4:46 PM IST
సైబర్ క్రైమ్‌ నుంచి కాపాడే ఇన్సూరెన్స్‌ పాలసీలివే!
ప్రతీకాత్మక చిత్రం (Image : Reauters)
  • Share this:
సైబర్ క్రైమ్... ఇండియాలో గ్రామగ్రామానికి విస్తరిస్తున్న నేరమిది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 డిసెంబర్ లెక్కల ప్రకారం 12,187 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ లెక్క 11,331 మాత్రమే. అంటే ఏడాదిలో 6.3 శాతం నేరాలు పెరిగాయి. రోజూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అయితే నష్టపోకుండా ఉండేందుకు కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు వచ్చాయి. ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నుంచి ఇ@సెక్యూర్ కాగా, మరొకటి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి సైబర్ సేఫ్.

సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటీ?

సైబర్ దాడి ఎవరిపైనైనా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు. ఎవరూ మినహాయింపు కాదు. ఇలాంటి సైబర్ దాడుల నుంచి కాపాడేదే సైబర్ ఇన్సూరెన్స్. మీ ముఖ్యమైన డేటాను కాపాడుకోవడమే కాకుండా, దానివల్ల జరిగే నష్టాలను సైబర్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

సైబర్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు?
సైబర్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే మీ పాలసీ కవరేజ్ ఎంత అన్నది మీ దగ్గరున్న డేటా, దాని ప్రాముఖ్యతను బట్టి మీరే నిర్ణయించుకోవాలి. బీమా కంపెనీ కస్టమర్ గత చరిత్రను, ఆన్‌లైన్ హిస్టరీని చూస్తుంది. గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల డేటా కోల్పోతే ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. అందుకే పాలసీ ఇచ్చే ముందే చెక్‌లిస్ట్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ.

145 Google Apps Found Infected With Malware Fishing Data From Windows Systems
image: Getty Images


సైబర్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఇ@సెక్యూర్ పాలసీలో పాలసీదారుడి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డులపై అనధికార లావాదేవీలు కవర్ అవుతాయి. అంతేకాదు... పాలసీదారుడి కీలకమైన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో బహిర్గతపర్చి ప్రతిష్టకు భంగం కలిగించినా ఇన్సూరెన్స్ లభిస్తుంది. అంతే కాదు... కోర్టు ఖర్చుల్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. బజాజ్ అలియాంజ్ ఇన్డివిజ్యువల్ సైబర్ సేఫ్ పాలసీలో సోషల్ మీడియా, థర్డ్ పార్టీ డేటా చోరీ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం లాంటి 10 అంశాలు కవర్ అవుతాయి. కుటుంబం మొత్తానికి కలిపి ఈ పాలసీలు తీసుకోవచ్చు.

ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.5 లక్షలకు సైబర్ పాలసీ తీసుకున్నారంటే... అందులో వారి ప్రతిష్టకు 25 శాతం అంటే రూ.1.25 లక్షలు కేటాయిస్తుంది కంపెనీ. అంటే... పాలసీ సమయంలో పాలసీదారుడి గౌరవాన్ని భంగపరిచే సమాచారం ఆన్‌లైన్‌లో ఎవరైనా పోస్ట్ చేస్తే... ఐటీ నిపుణుడి ద్వారా ఆ పోస్ట్ తొలగించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ రూ.1.25 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. ఆ తర్వాత రూ. 3.75 లక్షలకు మాత్రమే బీమా ఉంటుంది.

సైబర్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ కావు?
మోసపూరితంగా వ్యవహరించినా, శారీరకంగా గాయపడ్డా, ఆస్తుల విధ్వంసం జరిగినా, దుర్భాషలాడినా, అనధికారికంగా డేటా సేకరించినా, అనైతికంగా, అశ్లీలంగా వ్యవహరించినా పాలసీ వర్తించదు. ప్రభుత్వ ఆదేశాల వల్ల జరిగిన నష్టానికీ ఇన్సూరెన్స్ రాదు.

అందుకే సైబర్ పాలసీ తీసుకునే ముందు మీరు ఎందుకు ఆ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు? అసలు మీకు సైబర్ పాలసీ అవసరమా? అందులో ఏమేం కవర్ అవుతాయి? అన్నది విశ్లేషించుకోవాలి.

ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?
Published by: Santhosh Kumar S
First published: October 2, 2018, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading