ఫోన్ చేసి స్వీట్ గా మాట్లాడతారు...నమ్మి వివరాలు చెబితే...గోవిందా...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నామని, ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని వాటిని క్లియర్ చేసేందుకు వివరాలు తెలపాలని కోరగా, సదరు ఉద్యోగి అమాయకంగా వివరాలు తెలపడంతో క్షణాల్లో బ్యాంకు ఖాతా నుంచి రూ.70 వేలు మాయం అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది.

news18-telugu
Updated: August 2, 2019, 3:44 PM IST
ఫోన్ చేసి స్వీట్ గా మాట్లాడతారు...నమ్మి వివరాలు చెబితే...గోవిందా...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అమాయకుల బ్యాంకు ఖాతాలే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ ప్రభుత్వం ఉద్యోగికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నామని, ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని వాటిని క్లియర్ చేసేందుకు వివరాలు తెలపాలని కోరగా, సదరు ఉద్యోగి అమాయకంగా వివరాలు తెలపడంతో క్షణాల్లో బ్యాంకు ఖాతా నుంచి రూ.70 వేలు మాయం అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి లబోదిబోమన్నాడు. తనకు ఫోన్ చేసింది బ్యాంకు వారు కాదని సైబర్ మోసగాళ్లని తెలుసుకునే లోగానే డబ్బు మాయం అయ్యింది. అయితే జరిగిన తతంగమంతా స్థానిక ఎస్‌బీఐలో ఫిర్యాదు చేయగా తమ బ్యాంకు నుంచి అలాంటి కాల్స్ రావని, చివరికి బ్యాంకు మేనేజర్ మీ డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదని బాధిత వ్యక్తికి బ్యాంకు సిబ్బంది తేల్చి చెప్పారు.

అయితే జరిగిన సైబర్ చౌర్యం తమ చేతుల్లో లేదని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. అయితే స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపారు. ఆ ఫోన్ పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల ఏమరపాటుగా ఉండవద్దని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు