హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Locker Rules: బ్యాంకు లాకర్లకు RBI కొత్త రూల్స్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Bank Locker Rules: బ్యాంకు లాకర్లకు RBI కొత్త రూల్స్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Bank Locker Rules(FILE)

Bank Locker Rules(FILE)

Bank Locker Rules: కొంతమంది తమ విలువైన లేదా అమూల్యమైన వస్తువులను దాచుకునేందుకు బ్యాంకు లాకర్‌ సిస్టంను వాడుకుంటారు. అటువంటి వారికి ఇప్పుడు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొంతమంది తమ విలువైన లేదా అమూల్యమైన వస్తువులను దాచుకునేందుకు బ్యాంకు లాకర్‌ (Bank Locker)సిస్టంను వాడుకుంటారు. అటువంటి వారికి ఇప్పుడు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. 2021 ఆగస్టు(August)18న ఆర్‌బీఐ(RBI) ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం.. సేఫ్‌ డిపాజిట్‌ లాకర్ల కోసం బోర్డు ఆమోదించిన విధంగా బ్యాంకుల అగ్రిమెంటు ఉండాలి. దీని కోసం ఐబీఎం రూపొందించిన మోడల్‌ లాకర్‌ విధానాన్ని అనుసరించవచ్చు. మొత్తంగా చూస్తే ఈ కొత్త నిబంధనలు, విధానం తదితర అంశాలన్నీ సుప్రీంకోర్టు (Supreme Court)ఆదేశాల మేరకే ఉండాలి.

Budget 2023: కొత్త బడ్జెట్‌లో 30% ట్యాక్స్ శ్లాబ్‌ రూల్స్ మారుస్తారా..?నిపుణుల విశ్లేషణ ఇదే..

ఈ ఏడాది నుంచే రూల్స్ వర్తింపు..

2022 జనవరి నుంచే కొత్తగా లాకర్లు తీసుకునే కస్టమర్లకు ఈ రూల్స్‌ వర్తిస్తున్నాయి. అయితే పాత కస్టమర్లకు మాత్రం 2023 జనవరి నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. దీని ప్రకారం వారు సంబంధిత బ్యాంకుతో కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాలి. కస్టమర్లు కొత్త నిబంధనల గురించి తెలుసుకుని, తప్పనిసరిగా సంబంధిత బ్యాంకు అగ్రిమెంటులో సంతకం చేయాలి. కొత్త నిబంధనల్లో కస్టమర్లకు ఇబ్బంది కలిగించే క్లాజులు ఏమాత్రం ఉండకూడదని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.

అసంబద్ధమైన షరతులు ఉండకూడదు..

బ్యాంకుల్లో ఇప్పటికే లాకర్లు వినియోగించుకుంటున్న కస్టమర్లకు జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఆ మేరకు అగ్రిమెంటు పూర్తి చేసుకోవాలి. దీనికి సంబంధించి డిసెంబర్‌ ఆఖరి వారం నుంచి బ్యాంకులు తమ కస్టమర్లకు మెసేజ్‌లు పంపుతున్నాయి. ఇంకొంతమంది కస్టమర్లకు ఇప్పటికీ మెసేజ్‌లు వస్తున్నాయి. కొత్త అగ్రిమెంటులో కస్లమర్లను ఇబ్బంది పెట్టే అసంబద్ధమైన షరతులు ఉండకూడదు. బ్యాంకు ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన వాటి కంటే ఎక్కువ నిబంధనలు ఉండకూడదు.

కొంత గందరగోళం..

బ్యాంకులు పంపుతున్న మెసేజెస్‌లో అగ్రిమెంటుకు సంబంధించి ఆఖరి తేదీ చెప్పకపోవడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. అగ్రిమెంటు చేసుకోవడానికి జనవరి 1 ఆఖరు తేదీ అంటూ ఉత్తరాది రాష్ట్రాల్లోని కొంతమంది సీనియర్‌ సిటిజన్లకు డిసెంబర్‌ నెలాఖరులో సమాచారం ఇచ్చారు. అసలే ఇది చలికాలం కావడంతో ఇదొక పెద్ద సమస్యగా పరిణమించింది. మరోవైపు, కొత్త రూల్స్‌కు సంబంధించి అగ్రిమెంటు చేసుకోడానికి స్టాంప్‌ పేపర్లు పట్టుకురావాలని కస్టమర్లకు బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటివి, ఎంత ఖరీదు చేసేవి తీసుకోవాలో తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా కొంతమందికి అసలు ఎటువంటి సమాచారం లేదు. ఇంకొంతమందికి ఇప్పుడు మెసేజ్‌లు వస్తున్నాయి.

కస్టమర్ల ప్రయోజనాల కోసమే..

ఖాతాదారుల ప్రయోజనం దృష్ట్యా లాకర్ల సేష్టీ కోసం బ్యాంకులు ప్రత్యేక వ్యవస్థను నిర్వహించాలని ఆర్‌బీఐ పేర్కొంది. లాకర్లకు సంబంధించి ఏదైనా నష్టం లేదా ప్రమాదం సంభవిస్తే బాధ్యత తీసుకునేలా, పర్యవేక్షించేలా ఉండాలని, దానికి అనుగుణంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా పాలసీ ఉండాలని సూచిస్తోంది. లాకర్లను సమర్థంగా నిర్వహించడం, అనధికారికంగా తెరవకుండా చూడటం, దొంగతనం వంటివి జరగకుండా అవసరమైన జాగ్రత్తలు బ్యాంకులు తీసుకోవాలి.

SBI Nominee Update: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... 3 పద్ధతుల్లో నామినీ పేరు అప్‌డేట్ చేయండిలా

బ్యాంకు బాధ్యతలు.. కానివి..

ఒకవేళ భూకంపం, వరదలు, మెరుపులు, ఉరుములు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి లాకర్లకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి బ్యాంకు బాధ్యత వహించక్కర్లేదని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే బ్యాంకులు మాత్రం తమ పరిధిలో జరిగే ప్రమాదాల నుంచి కాపాడుకునేలా లాకర్లకు తగిన రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. సరైన నిఘా లేకపోవడం, నిర్లక్ష్యం, ఇతర లోపాల కారణంగా అగ్ని ప్రమాదాలు, బిల్డింగ్‌ కూలిపోవడం, దొంగతనం, దోపిడి వంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా బ్యాంకుదే. ఇలాంటి సందర్భాల్లో ఏదైనా నష్టం జరిగితే, కస్టమర్లకు వంద రెట్ల పరిహారం చెల్లించాలి. సంబంధిత నియమ, నిబంధనలను కస్టమర్లకు బ్యాంకులు పూర్తిగా తెలియజేయాలి. అగ్రిమెంటు కాపీని కూడా వారికి అందించాలి.

First published:

Tags: Bank news, National News, Rbi

ఉత్తమ కథలు