హోమ్ /వార్తలు /బిజినెస్ /

BigBasket Report: 2022లో ఆఫర్‌లతో రూ.1,515 కోట్లు ఆదా చేసిన కస్టమర్లు.. బిగ్‌బాస్కెట్‌ రిపోర్ట్‌పై ఓ లుక్కేయండి..

BigBasket Report: 2022లో ఆఫర్‌లతో రూ.1,515 కోట్లు ఆదా చేసిన కస్టమర్లు.. బిగ్‌బాస్కెట్‌ రిపోర్ట్‌పై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన బిగ్‌బాస్కెట్‌(BigBasket) కంపెనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకు డెలివరీ చేస్తుంది. మెట్రో నగరాల్లో ఎక్కువ మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా బిగ్‌బాస్కెట్‌ 2022కి సంబంధించిన బిజినెస్‌ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ బిగ్‌రీక్యాప్‌(BigRecap)ను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన బిగ్‌బాస్కెట్‌ (BigBasket) కంపెనీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారం(Online Grocery Platform) ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకు డెలివరీ చేస్తుంది. ప్రస్తుతం బిగ్‌బాస్కెట్‌ బిజినెస్‌ దూసుకుపోతోంది. మెట్రో నగరాల్లో ఎక్కువ మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా బిగ్‌బాస్కెట్‌ 2022కి సంబంధించిన బిజినెస్‌ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ బిగ్‌రీక్యాప్‌(BigRecap)ను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రోమో కోడ్‌లు, ఆఫర్‌లతో రూ.1,515 కోట్లు ఆదా

2022లో బిగ్‌బాస్కెట్‌ 55 నగరాల్లో 160 మిలియన్‌లకు పైగా ఆర్డర్‌లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. కూరగాయల విభాగంలో ఎక్కువ మంది టమోటాలను ఆర్డర్‌ చేసినట్లు చెప్పింది. ఈ సంవత్సరం డిస్కౌంట్లు, ప్రోమో కోడ్‌లు, ఆఫర్‌లను ఉపయోగించి భారతీయులు మొత్తం రూ.1,515 కోట్లు ఆదా చేశారని పేర్కొంది. ఏడాదిలో దాదాపు 750 మిలియన్ ఉత్పత్తులను విక్రయించింది. కర్ణాటక నుంచి అత్యధిక ఆర్డర్‌లు అందుకుంది. 35,565 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌ సాయంతో మొత్తం 8.5 మిలియన్ల కుటుంబాలకు సేవలు అందించింది.

400 కేజీల కొత్తిమీర డెలివరీ

కస్టమర్‌లు రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ ఆర్డర్‌లు చేసినట్లు బిగ్‌బాస్కెట్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత రద్దీగా ఉండే రోజులో ఒకే రోజు 580,000 ఆర్డర్‌లను డెలివరీ చేసినట్లు తెలిపింది. ధనియా లేదా కొత్తిమీర కూడా ఒక ప్రసిద్ధ వస్తువుగా మారిందని, దాదాపు 400 కిలోల కొత్తిమీరను 100 గ్రాములు రూ.2 చొప్పున డెలివరీ చేసినట్లు చెప్పింది. ఈ సంవత్సరం మొత్తం 397,708 డైపర్లు కూడా ఆర్డర్‌ చేశారని వివరించింది.

2025లో బిగ్‌బాస్కెట్‌ ఐపీవో?

ఇటీవల బిగ్‌బాస్కెట్‌ 200 మిలియన్‌ డాలర్‌ల నిధులను సేకరించింది. 2025 నాటికి స్టాక్‌మార్కెట్‌లో ఐపీవో(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌)ద్వారా లిస్ట్‌ అయ్యే ప్రణాళికల్లో ఉంది. బిగ్‌బాస్కెట్ గత సంవత్సరం బెంగళూరులో కొత్త టెక్నాలజీతో నడిచే సెల్ఫ్‌ సర్వీస్‌ 'ఫ్రెషో' స్టోర్‌ను ప్రారంభించడంతో ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2023 నాటికి భారతదేశంలో 200 ఫిజికల్ అవుట్‌లెట్‌లను, 2026 నాటికి 800 ఫిజికల్ అవుట్‌లెట్‌లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే రిటైల్‌ విక్రయ కేంద్రాలను కూడా బిగ్‌ బాస్కెట్‌ ప్రారంభిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో తాజా కూరగాయలు, పండ్లు సహా మొత్తం 4 వేలకు పైగా ఉత్పత్తులు లభించేలా భారీ కేంద్రాన్ని స్టార్ట్‌ చేసింది. ఇండియాలోని ఇతర ప్రధాన నగరాలతో కలిపి త్వరలో మరో 24 రిటైల్‌ విక్రయ కేంద్రాలను లాంచ్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలిపింది.

First published:

Tags: Latest offers, Online shopping, Year Ender 2022

ఉత్తమ కథలు