దురదృష్టవశాత్తూ ఎదురయ్యే ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ కల్పించడానికి ఇన్సూరెన్స్ పాలసీలను (Insurance Policy) తీసుకొచ్చారు. ఇంటి పెద్ద దూరమైతే కుటుంబం ఆర్థికంగా కష్టాలు అనుభవించకుండా లైఫ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య అవసరాల ఖర్చులను భర్తీ చేసేలా హెల్త్ పాలసీలు (Health Insurance) ఆదుకుంటాయి. ఇలాంటి నష్టాన్ని పూడ్చడమే ఇన్సూరెన్స్ లక్ష్యమైనా, ఇన్సూరెన్స్ కవర్‌పై లిమిట్ ఉంటుంది. అందుకే ఎక్కువ కవరేజీ కోసం వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వేర్వేరు పాలసీలను కొందరు తీసుకుంటారు.
ఇన్సూరెన్స్ ప్రధాన ఉద్దేశం లాభాలను పొందడం కాదు, నష్టాలను భర్తీ చేసుకోవడం. ఒక వ్యక్తి తీసుకొనే ఇన్సూరెన్స్ కవర్‌కు లిమిట్ ఉంటుంది. అదనంగా ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోలేదని నిర్ధారించుకోవడానికి, ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో.. అదే ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ఇతర కంపెనీలలో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల వివరాలన్నింటినీ వెల్లడించాలని కోరుతారు. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అయినా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.
Royal Enfield: రూ.70,000 లోపే రాయల్ ఎన్ఫీల్డ్... కానీ ఓ పెద్ద ట్విస్ట్
చాలా మంది వ్యక్తులు అప్లికేషన్ ఫారమ్‌లలో అలాంటి సమాచారం అందించరు. ఫారమ్‌ను పూరించేటప్పుడు సమయం, శ్రమ ఎందుకని, ఈ సమాచారాన్ని వెల్లడించరు. చట్టవిరుద్ధమైన లాభాల కోసం కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అలాంటి సమాచారాన్ని దాచడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్‌లో ఇన్సూరెన్స్‌ను చేర్చడంతో అటువంటి సమాచారాన్ని దాచడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ సంబంధిత సమాచారం అంతా ఎలక్ట్రానిక్‌గా ఒకే చోట అందుబాటులో ఉంటుంది.
దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), 2022 నవంబర్ 15న ఇన్సూరెన్స్ కంపెనీలకు ఓ సర్క్యులర్ పంపింది. ఇన్సూరెన్స్ సంబంధిత డేటాను అకౌంట్ అగ్రిగేటర్లతో (AA) ఎలా షేర్ చేసుకోవచ్చనే దానిపై మార్గదర్శకాలను అందజేసింది. అకౌంట్ అగ్రిగేటర్లు, ప్రాథమికంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC). అన్ని సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ల డేటాను ఒకే చోట అందించడానికి వివిధ సంస్థల నుంచి ఫైనాన్షియల్ డేటాను పొందుతాయి. ఇన్వెస్ట్మెంట్ సంబంధిత డేటాతోపాటు ఇన్సూరెన్స్ డేటాను కూడా సేకరిస్తాయి.
Aadhaar Update: ఆధార్ అప్డేట్ తప్పనిసరా? చేయకపోతే ఏమవుతుంది?
ఇన్సూరెన్స్ కంపెనీలు ఫైనాన్షియల్ డేటాను పంచుకోవడానికి మాత్రమే కాకుండా, ఆర్థిక పూచీకత్తు కోసం డేటాను కూడా పొందుతాయి. అనవసరమైన రాతపూర్వక పనులను నివారించడానికి, డేటాను ఎలక్ట్రానిక్‌గా కలెక్ట్ చేస్తాయి. అదే ఫార్మాట్లో షేర్ చేస్తాయి.
డేటాను పంచుకునే, స్వీకరించే సంస్థలు అకౌంట్ అగ్రిగేటర్ల సిస్టమ్‌తో ఇంటిగ్రేట్ కావడానికి API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్)ను ఉపయోగిస్తాయి. కస్టమర్ ఫైనాన్షియల్ డేటాను పంచుకోవడం అనేది కస్టమర్ల ముందస్తు సమ్మతిపై ఆధారపడి ఉంటుంది. డేటాను రెగ్యులేటెడ్ ఎంటిటీస్తో మాత్రమే షేర్ చేయవచ్చు. అంతేకాకుండా అకౌంట్ అగ్రిగేటర్లతో సమాచారాన్ని పంచుకునేటప్పుడు డేటా ప్రొటెక్షన్ ఉందా? లేదా? నిర్ధారించుకోవాలని IRDAI ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచించింది.
Bharat Gaurav Kashi Darshan Train: రూ.20,000 ధరకే వారం రోజుల కాశీ యాత్ర... ప్యాకేజీ వివరాలివే
ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (లీగల్ & కంప్లయన్స్) & కంపెనీ సెక్రటరీ కాంజీవరం బరధ్వాజ్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే RBI-రిజిస్టెర్డ్ అకౌంట్ అగ్రిగేటర్ల ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ , ఇన్సూరెన్స్ పాలసీలు, పెన్షన్ ఫండ్లు మొదలైన ఫైనాన్షియల్ డేటాను సేకరించి ఎండ్ యూజర్లతో పంచుకొంటాయని చెప్పారు. ఈ డేటాను కస్టమర్లు, బ్యాంకులు, NBFC, ఇన్సూరెన్స్ కంపెనీలు బిజినెస్ గ్రోత్‌కు ఉపయోగించుకుంటాయని, అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుంటాయని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance, Life Insurance, Personal Finance, Term insurance