CUSTOMERS CAN RENT A GIRLFRIEND AT CHINESE SHOPPING MALL DURING SHOPPING AT A COST OF RS 10 SS
పది రూపాయలకే గాళ్ ఫ్రెండ్... ఎక్కడో తెలుసా?
ఇలా ఒకే ఆర్డర్లో తీసుకునే వస్తువులు ఎక్కువ ఆర్డర్లు చెయ్యడం వల్ల వాటి ప్యాకేజీకి, క్యారీ బ్యాగ్స్ ఇతరత్రా వాటి వల్ల గ్రీన్ హౌస్ వాయివు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
Girlfriend for rent | కార్, బైక్ అద్దెకు తీసుకోవడం గురించి విన్నాం కానీ... గాళ్ ఫ్రెండ్స్‌ని అద్దెకు అందించే సర్వీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ సర్వీస్ ఎక్కడో తెలుసుకోండి.
చైనాలో ఓ షాపింగ్ మాల్ కుర్రాళ్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం 10 రూపాయలకే గాళ్ ఫ్రెండ్స్‌ని అద్దెకు పంపిస్తోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో హ్యూవాన్ సిటీలో ది విటాలిటీ సిటీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడికి ఒంటరిగా వచ్చే యువకులకు అద్దెకు గాళ్ ఫ్రెండ్స్‌ని అందుబాటులో ఉంచింది ఈ షాపింగ్ మాల్. షాపింగ్ కోసం అమ్మాయి తోడుగా కావాలంటే వారిని అద్దెకు తీసుకోవచ్చు. 20 నిమిషాలకు రూ.10 చెల్లిస్తే చాలు. అమ్మాయిలు అక్కడ పోడియం దగ్గర నిలబడి ఉంటారు. కస్టమర్లు ఎవరు నచ్చితే వారిని అద్దె చెల్లించి షాపింగ్ కోసం తోడుగా తీసుకెళ్లొచ్చు. కేవలం 20 నిమిషాలు మాత్రమే తోడుగా వస్తారు. సమయం దాటిందంటే వీళ్లు మళ్లీ పోడియం దగ్గరకు వచ్చేస్తారు.
అద్దెకు గాళ్ ఫ్రెండ్స్‌లా వచ్చేందుకు 15 మంది యువతులు సిద్ధంగా ఉంటారు. యువకులు మాత్రమే కాదు... యువతులు కూడా ఈ అమ్మాయిలను షాపింగ్‌కు తోడుగా తీసుకెళ్లొచ్చు. షాపింగ్‌లో ఏవైనా డౌట్స్ వస్తే వీరి సాయం తీసుకోవచ్చు. షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం లాంటి సేవలు అందిస్తారు. అంతేకాదు... లంచ్, డేటింగ్ కోసం కూడా కస్టమర్లు వారిని తీసుకెళ్లొచ్చు. కానీ రెండు రూల్స్ ఉంటాయి. గాళ్ ఫ్రెండ్‌గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదు. వచ్చే కస్టమర్ల సంఖ్యను పెంచేందుకు ఇలా అద్దెకు గాళ్ ఫ్రెండ్స్‌ని అరేంజ్ చేసింది ఈ షాపింగ్ మాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.