హోమ్ /వార్తలు /బిజినెస్ /

Coronavirus: రూ.2000, రూ.500, రూ.200 నోట్లతో కరోనా వైరస్... ఎస్‌బీఐ పరిశోధన

Coronavirus: రూ.2000, రూ.500, రూ.200 నోట్లతో కరోనా వైరస్... ఎస్‌బీఐ పరిశోధన

Coronavirus: రూ.2000, రూ.500, రూ.200 నోట్లతో కరోనా వైరస్... ఎస్‌బీఐ పరిశోధన
(ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus: రూ.2000, రూ.500, రూ.200 నోట్లతో కరోనా వైరస్... ఎస్‌బీఐ పరిశోధన (ప్రతీకాత్మక చిత్రం)

SBI on Coronavirus | మీ దగ్గరున్న కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందా? ఈ అనుమానంపై ఎస్‌బీఐ పరిశోధన చేసింది.

కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వస్తుందా? వచ్చే అవకాశముందని తేల్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. అంతేకాదు... పేపర్ కరెన్సీ నోట్ల కన్నా ఆస్ట్రేలియా, యూకే, కెనెడాలో ఉన్నట్టుగా పాలిమర్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చే అవకాశాలపై పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎస్‌బీఐ. కరోనా వైరస్ మాత్రమే కాదు... కరెన్సీ నోట్లతో ఏవైరస్ అయినా వ్యాప్తి చెందే అవకాశముందన్నది నిపుణుల మాట. అందుకే డిజిటల్ పద్ధతిలోకి మారడమే సరైన మార్గం. కానీ పూర్తిగా నోట్లను తొలగించి డిజటల్ క్యాష్‌కు మారడం ఇండియాలో సాధ్యం కాదు. అందుకే కరెన్సీ నోట్లకు ఉపయోగించే కాగితం సురక్షితమైనదిగా ఉండాలన్నది నిపుణుల వాదన. 2020 మార్చి 17న రూపొందించిన 'ఎకోవ్రాప్' రిపోర్ట్‌లో ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది ఎస్‌బీఐ నిపుణుల బృందం.

కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ సోకుతుందన్న భయాందోళనలు ప్రస్తుతం నెలకొన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎస్‌బీఐ తన రిపోర్ట్‌ను బయటపెట్టింది. కరెన్సీ నోట్లకు, సూక్ష్మజీవులకు సంబంధం ఉందని నిరూపించేలా ఎస్‌బీఐ తన రిపోర్ట్‌లో పలు రిపోర్టులను ఉదహరించింది. అందులో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్-CAIT నివేదికలోని అంశాలున్నాయి. కరెన్సీ నోట్లపై సూక్ష్మజీవులు ఉంటాయని, అవి అనేక రోగాలు ఇన్ఫెక్షన్లకు కారణమౌతాయని, మూత్ర, శ్వాసకోశ అంటువ్యాధులు, చర్మ వ్యాధుల్లాంటివి కరెన్సీ నోట్ల ద్వారా సోకే ప్రమాదం ఉందన్నది ఆ రిపోర్ట్ సారాంశం.

ఇవి కూడా చదవండి:

Coronavirus Effect: కస్టమర్లకు ఎస్‌బీఐ ముఖ్య గమనిక

Coronavirus: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఇలా చేయమంటున్న ఈపీఎఫ్ఓ

Coronavirus Effect: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్

First published:

Tags: Bank, Banking, Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Currency, Mobile Banking, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు