Home /News /business /

CUEMATH OFFERS FREE MATH COURSES ONLINE HERE IS THE DETAILS AK GH

విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.20 వేల విలువైన ప్రీమియం మాథ్స్ కంటెంట్​ ఉచితం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

క్యూమ్యాథ్ (Cuemath) సంస్థ తమ వెబ్‌సైట్‌లోని ప్రీమియం కంటెంట్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తున్నామని ప్రకటించింది. ప్రత్యర్థులకు పోటీగా నిలిచేందుకు, లెర్నింగ్ విషయంలో అసమానతలు తొలగించేందుకు ఈ మ్యాథ్ కోర్స్ సంస్థ ఆకర్షణీయమైన ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టడంతో విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.

ఇంకా చదవండి ...
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ విద్యారంగంలో అనేక మంచి మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ సంస్థలు అవతరించాయి. ఈ సంస్థల ద్వారా లక్షల మంది ప్రతిభ గల ఉపాధ్యాయులు వినూత్నంగా పాఠాలు బోధిస్తూ ప్రపంచ నలుమూలలాప్రతి విద్యార్థిని ఆకట్టుకుంటున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ ఎడ్యుటెక్ సంస్థల్లో రికార్డు స్థాయిలో విద్యార్థులు జాయిన్ అయ్యారని తెలుస్తోంది. మరోపక్క చైనా ఆధారిత ఎడ్యుటెక్ సంస్థలు అక్కడి నియమ నిబంధనల వల్ల కుదేలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను సద్వినియోగం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు భారతీయ ఎడ్యుకేషన్ ప్రొవైడర్లు ముందు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా క్యూమ్యాథ్ (Cuemath) సంస్థ తమ వెబ్‌సైట్‌లోని ప్రీమియం కంటెంట్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తున్నామని ప్రకటించింది. ప్రత్యర్థులకు పోటీగా నిలిచేందుకు, లెర్నింగ్ విషయంలో అసమానతలు తొలగించేందుకు ఈ మ్యాథ్ కోర్స్ సంస్థ ఆకర్షణీయమైన ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టడంతో విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.

అయితే, నిజానికి ‘క్యూమ్యాథ్‌’ ప్రీమియం పాఠ్యాంశాలు వినాలంటే.. ఏడాదికి 299 డాలర్లు (సుమారు రూ. 22 వేలు) చెల్లించాల్సి ఉంటుంది. కానీ సరికొత్త ఆఫర్ ప్రకారం, ఎవరైతే సబ్‌స్క్రైబర్లు మరో ఇద్దరు విద్యార్థులను క్యూమ్యాథ్ కి ఇన్వైట్ చేస్తారో వారు ఉచితంగానే ప్రీమియం కంటెంట్‌కు యాక్సెస్​ లభిస్తుంది.అంతేకాదు, వారు పరిమిత స్థాయిలో ప్రాథమిక పాఠ్యాంశాలు ఉచితంగా పొందవచ్చు. ఈ సంస్థ ప్రతి క్లాసుకి 16 డాలర్ల చొప్పున వసూలు చేస్తూ ట్యూటర్‌లతో లైవ్ సెషన్‌లతో కూడిన ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తుంది. దేశీయ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌తో పాటు ఇతర సంస్థలకు పోటీగా క్యూమ్యాథ్‌ అభివృద్ధి చెందుతోంది.

KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..

kiara advani: కియారా అద్వానీలా ఉన్న యువతి.. అట్రాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరామె..

బైజూస్​కు ధీటుగా రాణిస్తోన్న క్యూమ్యాథ్స్​
కోవిడ్ తో పాఠాలకు దూరమైన ప్రపంచంలోని చాలా మంది పిల్లల్లో మ్యాథ్స్ బేసిక్స్ పెంచేందుకు తాము కృషి చేస్తున్నట్లు క్యూమ్యాథ్‌ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐఐటీయన్(IITian) మనన్ ఖుర్మా ఒకఇంటర్వ్యూలో వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన క్యూమ్యాథ్‌ సంస్థలో సీక్వోయా క్యాపిటల్(Sequoia Capital), అల్ఫాబెట్ క్యాపిటల్(Alphabet’s CapitalG) పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. 20 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ మ్యాథ్స్- లెర్నింగ్ మార్కెట్‌పై తమ సంస్థ దృష్టిసారిస్తోందని తెలిపారు.ఉచిత ఆఫర్‌తో కూడా క్యూమ్యాథ్‌ ఆదాయం ఏడాదికి లేదా రెండేళ్లకు $100 మిలియన్లకు చేరుకోనుందని తెలిపారు.మనన్ ఖుర్మాకి గణితం అంటే చాలా ఇష్టం. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే హైస్కూల్ విద్యార్థులకు మ్యాథ్స్ నేర్పించేవారు. 2013లో ఆయన ఆఫ్‌లైన్ సంస్థగా క్యూమ్యాథ్‌ (గతంలో క్యూలెర్న్)ను ప్రారంభించారు. క్రమేపీ అది ఆన్‌లైన్‌ సంస్థగా అవతరించింది. ఇప్పుడు ఈ సంస్థలో పదివేల మంది ట్యూటర్లు పనిచేస్తున్నారు. ఇండియా, అమెరికా, కెనడా యుకే దేశాలకు చెందిన మూడు లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ ఆన్‌లైన్‌ విద్యాసంస్థ వేదికగా గణితం నేర్చుకుంటున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Online Education

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు