CRYPTOCURRENCY SANTA FLOKI SURGES 4000 PER CENT AFTER ELON MUSKS TWEET MK
Santa Floki Coin: కుక్క ఫోటో పెట్టినా కోట్లు రాలాయి..ఇది కదా ఎలాన్ మస్క్ సత్తా అంటే...
ప్రతీకాత్మకచిత్రం
Santa Floki Coin: టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే, అతడు చేసే ట్వీట్స్ ఒక్కోసారి కోట్లు కురిపిస్తాయి. లేకపోతే పాతాళంలో పడేస్తాయి. ఇక క్రిప్టో కరెన్సీ విషయంలో అయితే మస్క్ రూటే సపరేటు. అతడు ట్వీట్ చేశాడని బిట్ కాయిన్ దశ మారిపోయింది.
Santa Floki Coin: టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే, అతడు చేసే ట్వీట్స్ ఒక్కోసారి కోట్లు కురిపిస్తాయి. లేకపోతే పాతాళంలో పడేస్తాయి. ఇక క్రిప్టో కరెన్సీ విషయంలో అయితే మస్క్ రూటే సపరేటు. అతడు ట్వీట్ చేశాడని బిట్ కాయిన్ దశ మారిపోయింది. అంతేకాదు అతడు ట్వీట్ చేసిన డోజ్ కాయిన్, అలాగే పలు పోర్న్ క్రిప్టోలు కూడా దుమ్ముదులిపేశాయి. ఇక ఇప్పుడు తాజాగా ఎలోన్ మస్క్ మరోసారి క్రిప్టోకరెన్సీ పరిశ్రమపై తన ముద్రను వేసి ఓ క్రిప్టో కాయిన్ దశ మార్చేశాడు. మస్క్ క్రిస్మస్ సందర్భంగా ఇటీవల తన కుక్క ఫోటోను పోస్ట్ చేశాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా. అందులోనే మతలబు ఉంది. అతడి ట్వీట్ దెబ్బకు డాగ్ థీమ్ క్రిప్టోకరెన్సీ Floki Coin ధర అమాంతంగా పెరిగింది. నిజానికి ఈ క్రిప్టోకరెన్సీకి మస్క్ పెంపుడు కుక్కకు సంబంధం ఏముందా అని ఆలోచిస్తున్నారా. మస్క్ కుక్క పేరు Floki కావడం విశేషం. శాంటా క్లాస్ కాస్ట్యూమ్‌లో ఉన్న ఫ్లోకీ చిత్రాన్ని మస్క్ పోస్ట్ చేయగానే, ఈ క్రిప్టోకరెన్సీ ధర ఏకంగా 4,000 శాతం పైగా పెరిగింది. అంటే 10 వేల రూపాయల ఇన్వెస్టర్లకు 4 లక్షల రూపాయలుగా దక్కాయని అర్థం.
క్రిస్మస్ పర్వదినమైన డిసెంబర్ 25న ఎప్పటిలాగే, ఎలాన్ మస్క్ తన పెంపుడు కుక్క 'ఫ్లోకి’ని శాంటా క్లాజ్ డ్రెస్ వేసి ఫోటో తీసి ఫ్లోకీ సాంటా అనే పేరుతో పోస్ట్ చేశాడు. దెబ్బకు ఫ్లోకి క్రిప్టో భారీ రాబడిని ఇచ్చింది. Binance స్మార్ట్ చైన్ ఎడిషన్‌గా ప్రారంభించిన Floki, డిసెంబర్ 26న 3,944 శాతం ఎగిసింది.
ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్‌కి ఫ్లోకీ అనే కుక్కపిల్ల ఉంది. ట్విట్టర్లో 67.9 మిలియన్ల మంది అనుచరులతో, శాంతా క్లాజ్ దుస్తులలో అతని కుక్క పోస్ట్ 306,600 లైక్‌లను సంపాదించింది మరియు ఫోటో వైరల్‌గా మారింది. శాంటా ఫ్లోకీ విలువ గత సోమవారం 0.0000000129 డాలర్ల నుండి 0.000001718 డాలర్లకి పెరిగింది.
ఇదిలా ఉంటే శాంటా ఫ్లోకీ క్రిప్టోకరెన్సీ తయారీదారులు మాత్రం మంచి చేయాలనుకునే వారు తమతో కలిసి అందరికీ సహకరించాలనే తత్వం ఆధారంగా ఈ కాయన్ ను సృష్టంచామని పేర్కొన్నారు. ఈ కాయిన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవ్ ది చిల్డ్రన్ వంటి పేరున్న స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడానికి తాము ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
అంతేకాదు ఎలాన్ మస్క్ గతంలో కూడా ఇలాగే డోజ్ కాయిన్ ను ట్విట్టర్ ద్వారా పరిచయం చేశాడు. అప్పుడు కూడా దాని అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.