Crypto Heist: చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. రూ.4వేల కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ చోరీ.. షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

క్రిప్టో కరెన్సీ ట్రాన్స్​ఫర్ చేసే పోలీ నెట్​వర్క్​ సంస్థ నుంచి ఏకంగా హ్యాకర్లు 600 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని చోరీ చేశారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.4.46 వేల కోట్లు.

  • Share this:
క్రిప్టోకరెన్సీలో షాకింగ్​ ఘటన జరిగింది. క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ జరిగింది. క్రిప్టో కరెన్సీ ట్రాన్స్​ఫర్ చేసే పోలీ నెట్​వర్క్​ సంస్థ నుంచి ఏకంగా హ్యాకర్లు 600 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని చోరీ చేశారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.4.46 వేల కోట్లు. హ్యాకర్లు ఈ పని చేశారని ఆ కంపెనీ ప్రకటించింది. ఇథేరియమ్​, బినాన్స్​చైన్​, ఆక్స్​పాలిగన్​ క్రిప్టో టోకెన్లను హ్యాకర్లు కొట్టేశారని, ట్రేడర్ల వాలెట్ల నుంచి మాయం చేశారని ప్రకటించింది.

ఈ విషయాన్ని పోలీ నెట్​వర్క్​ ట్వీట్ చేసింది. హ్యాకర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. “మీరు (హ్యాకర్లు) హ్యాక్ చేసిన మొత్తం చరిత్రలోనే అతి పెద్ద మోసంగా నిలుస్తుంది. వేలాది మంది క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీ మెంబర్ల నుంచి మీరు డబ్బు దోచుకున్నారు” అంటూ పోలీ నెట్​వర్క్​ ట్వీట్ చేసింది. అలాగే తాము ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హ్యాకర్లను హెచ్చరించింది. అయితే ఈ విషయానికి పరిష్కారం కోసం ఓ అవకాశం ఇస్తున్నామని హ్యాకర్లకు చెప్పింది.

“పోలీ నెట్​వర్క్​పై దాడి జరిగిందని చెప్పేందుకు మేం చింతిస్తున్నాం. అందరికీ క్షమాపణలు చెబుతున్నాం. సొమ్ము అంతా హ్యాకర్ల కంట్రోల్​లో ఉన్న అకౌంట్లలోకి వెళ్లిపోయింది” అని పోలీ నెట్​వర్క్​ మరో ట్వీట్​లో ప్రకటించింది. మరోవైపు ఈ క్రిప్టో చోరీపై అమెరికా డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్​, ఎఫ్​బీఐ ఇంకా స్పందించలేదు.

హ్యాకర్ల వివరాలను కనుగొనేందుకు పోలీ నెట్​వర్క్ ప్రయత్నిస్తోంది. అలాగే ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. హ్యాకర్ల కంట్రోల్​లో ఉన్న వాలెట్ల నుంచి ఏవైనా ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్​లు వస్తే యాక్సెప్ట్ చేయవద్దని తమ యూజర్లకు సూచించింది. అలాగే ఇతర క్రిప్టో కరెన్సీ ప్రొవైడర్లను ఈ విషయంపై సంప్రదిస్తోంది. ఇన్వెస్టర్ల సొమ్ము జాగ్రత్తగా ఉండేలా హ్యాకర్ల కంట్రోల్​లో ఉన్న వాలెట్ల నుంచి ట్రాన్సాక్షన్లను అనుమతించవద్దని చెప్పింది.

ఎన్​స్క్రిప్షన్​తో కూడిన క్రిప్టో కరెన్సీ భద్రత విషయంలో మెరుగైనదే అని నిపుణులు చెబుతున్నా.. హ్యాకర్లు చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు అడపాదడపా చిన్న మొత్తాల్లో క్రిప్టోను దోచుకున్న హ్యాకర్లు ఇప్పుడు ఏకంగా పెద్ద మొత్తంలోనే దోపిడీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన రేగుతోంది. రెండేళ్ల క్రితం కూడా బినాన్స్ నుంచి 40 మిలియన్ డాలర్ల విలువైన బిట్​కాయిన్లు చోరీకి గురైన ఘటన సంచలనంగా మారింది. మరోవైపు గతేడాది కూడా క్రిప్టో చోరీ ఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

Viral Pic: వరద నీటిలో ఈతకొడుతూ కెమెరాకు చిక్కిన అందాల మత్స్యకన్య..

Meteor: ఆకాశంలో అద్భుతం.. అందమైన ఉల్కాపాతం.. ఎప్పుడంటే..
Published by:Shiva Kumar Addula
First published: