క్రిప్టో కరెన్సీ ఫౌండర్ ఆకస్మిక మరణం.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

క్రిప్టో కరెన్సీని నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో.. దేవుడా ఏంచేసేది అంటూ బోరుమంటున్నారు.

news18-telugu
Updated: February 6, 2019, 8:21 PM IST
క్రిప్టో కరెన్సీ ఫౌండర్ ఆకస్మిక మరణం.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
క్రిప్టో కరెన్సీ ఫౌండర్ గెరాల్డ్ కాటన్
  • Share this:
కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీని నమ్ముకుని భారీగా ఇన్వెస్ట్ చేసిన మదుపుదారులకు.. పెద్ద షాకే తగిలింది. ఈ క్రిప్టో కరెన్సీ ఫౌండర్‌ గెరాల్డ్‌ కాటన్‌ ఆకస్మికంగా మృతి చెందడంతో.. ఇన్వెస్టర్లు అనుకోని ఆదపలో పడ్డారు. దీనికి ప్రధానకారణం.. క్రిప్టో ఫకరెన్సీ ట్రేడ్ ప్లాట్‌ఫాంకు సంబంధించిన పూర్తి సమాచారమంతా గెరాల్డ్ కాటన్‌కు తప్ప మరెవరికీ తెలియకపోవడమే. దీంతో పెట్టుబడిదారులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి కీలకమైన సమాచారం గెరాల్డ్ కాటన్ దగ్గర ఉంది. అతి ముఖ్యమైన పాస్‌వర్డ్‌లు, రికవరీ కీతో సహా సమాచారమంతా గెరాల్డ్‌కు మాత్రమే తెలుసు. కానీ, ఇటీవల ఆయన ఆకస్మికంగా కన్నుమూయడంతో.. ఇన్వెస్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పాస్‌వర్డ్, రికవరీ కీ సమాచారం మరెవ్వరికీ తెలియకపోవడంతో.. దాదాపు 187 మిలియన్ల కెనడా డాలర్లు (రూ. 982 కోట్లు) ఫ్రీజ్ అయిపోయాయి.

ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఎక్స్‌పర్ట్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. పాస్‌వర్డ్, రికవరీ కీ తెలియకుండా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడడంతో.. నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. సంస్థలో పనిచేసే ఇతర అధికారులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ కావడం లేదు. దీంతో ఇన్వెస్టర్లు బోరుమంటున్నారు.

 
First published: February 6, 2019, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading