హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2022: డిజిటల్ రూపీ, క్రిప్టో కరెన్సీపై...Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే...

Union Budget 2022: డిజిటల్ రూపీ, క్రిప్టో కరెన్సీపై...Network18 Exclusive ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే...

Rahul Joshi Exclusive interview with Finance Minister Nirmala Sitharama

Rahul Joshi Exclusive interview with Finance Minister Nirmala Sitharama

నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సంభాషించారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన ఒక రోజు తర్వాత ఈ ఇంటర్వ్యూ తీసుసుకున్న ఈ ఇంటర్వ్యూ అనేక అంశాలపై ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

ఇంకా చదవండి ...

  FM Nirmala Sitharaman Exclusive Interview With Rahul Joshi |   బడ్జెట్ 2022-23 ప్రవేశ పెట్టిన అనంతరం వివిధ వర్గాల నుంచి స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు సైతం బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్‌వర్క్ 18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సంభాషించారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన ఒక రోజు తర్వాత ఈ ఇంటర్వ్యూ తీసుసుకున్న ఈ ఇంటర్వ్యూ అనేక అంశాలపై ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మోదీ ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నుంచి బీమా దిగ్గజం LIC , రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వరకు అనేక అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా ప్రత్యేకంగా సంభాషించారు.

  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, Network18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, క్రిప్టో ఆస్తులపై 30% పన్నుపై స్పందించారు. అంతేకాదు క్రిప్టో కరెన్సీ ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో 'డిజిటల్ వర్చువల్ ఆస్తులు'గా పేర్కొన్నారు.

  క్రిప్టోకరెన్సీలను నియంత్రించేందుకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నదా అనే ప్రశ్నకు సీతారామన్ స్పందిస్తూ, ఈ క్రిప్టో ఆస్తులపై కేంద్రం వైఖరిని ఇంకా స్పష్టం చేయాల్సి ఉందని సీతారామన్ తెలిపారు. "పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించే సమయంలో 'ప్రైవేట్ క్రిప్టో అసెట్', డిజిటల్ కరెన్సీకి మధ్య తేడాను గుర్తించేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు.

  సెంట్రల్ బ్యాంక్ మాత్రమే డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తుందని, అందుకే దానికి 'డిజిటల్ రూపీ'గా నామకరణం చేసినట్లు సీతారామన్ అన్నారు. క్రిప్టో డీల్స్‌పై 30 శాతం పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఎందుకంటే వాటి ద్వారా లాభాలు పొందుతున్నారని ఆమె అన్నారు. ఒక నిర్దిష్టమైన లాభంతో లావాదేవీలు ఉన్నందున, మేము దానిపై పన్ను విధించాలని నిర్ణయించుకున్నాము," అని నిర్మలా పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ లావాదేవీలను కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తుందని ఆమె పేర్కొన్నారు.  క్రిప్టోకరెన్సీ బిల్లు చాలా చర్చనీయాంశమైందని, ప్రస్తుతానికి దానిపై పెద్దగా స్పష్టత లేదని ఆర్థిక మంత్రి అన్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Budget 2022, Budget 2022-23, Union Budget 2022

  ఉత్తమ కథలు