క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును త్వరలో భారత పార్లమెంటులో ప్రవేశపెడతారనే వార్తల నేపథ్యంలో క్రిప్టో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బిట్‌కాయిన్ (Bitcoin)ధర ఇవాళ నెల రోజుల కనిష్ఠానికి పడిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్.. నవంబరు 24న అంటే ఇవాళ 55,460.96 డాలర్లకు పడిపోయింది. బిట్‌కాయిన్ ధర పతనానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సంవత్సరాంతపు లాభాల స్వీకరణతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. దీంతో క్రిప్టోకరెన్సీల్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. దీని వల్ల ధరలు పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Cryptocurrency: క్రిప్టో కరెన్సీపై నిషేధం లేదు... కేంద్రం తెస్తున్న చట్టం లక్ష్యమేంటి?
క్రిప్టో విలువలు వెల్లడించే కాయిన్ మార్కెట్ క్యాప్ (CoinMarketCap) ప్లాట్‌ఫాం ప్రకారం ఇవాళ ఉదయం గం.8.00లకు క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 0.58 శాతం క్షీణించి 56,607 డాలర్లకు చేరింది. మనదేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించే అవకాశం ఉంది. అయితే క్రిప్టోకరెన్సీలోని సాంకేతికతను, దాని వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని లోక్‌సభ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.
Crypto currencies: ఆ క్రిప్టో కరెన్సీలు మనుగడలో ఉండవా? రఘురామ్ రాజన్ ఏం చెబుతున్నారంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ జారీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని యోచిస్తోంది. అయితే క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 గురించి ఇతర వివరాలు లోక్‌సభ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచలేవు. మనదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తున్నారనే వార్తలతో మార్కెట్లు పతనం అవుతున్నాయి. బిట్‌కాయిన్ 57,000 నుంచి 58,000 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. దీని విలువ 57,000 డాలర్ల కన్నా తగ్గితే, అది క్రమంగా 53,000 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Cryptocurrency: క్రిప్టోను నిషేధిస్తే ఇప్పటికే చలామణిలో ఉన్న క్రిప్టోకరెన్సీ ఏమవుతుంది?
కార్డానో(Cardano), సోలానా (Solana) ఎక్స్.ఆర్.పి (XRP) క్రిప్టో కరెన్సీలు కూడా 24 గంటల్లో భారీగా క్షీణించాయి. సోలానా విలువ 2.18 శాతం తగ్గి 215.86 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కార్డానో విలువ 6.64 శాతం తగ్గి 1.68 డాలర్లకు క్షీణించింది. ఎక్స్.ఆర్.పి 1.40 శాతం తగ్గి 1.04 డాలర్లకు దిగివచ్చింది. అయితే ఈథర్ మాత్రం గడచిన 24 గంటల్లో లాభపడింది. క్రిప్టోకరెన్సీల విషయంలో ముందుచూపుతో ప్రగతిశీలమైన నిబంధనలను పరిశీలిస్తున్నట్టు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. వివిధ వర్గాల నుంచి కూడా ఈ కమిటీ అభిప్రాయాలు తీసుకోనుంది.
Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం, పకడ్బందీగా బిల్లు
మన యువతను పాడు చేసే ముఠాలు, ఉగ్రవాదుల చేతుల్లోకి క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ కరెన్సీలు వెళ్లకుండా ప్రజాస్వామ్య దేశాలు చూసుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. అప్పటి నుంచే క్రిప్టో నియంత్రణ బిల్లుపై వార్తలు వస్తున్నాయి. మనదేశంలో పది కోట్ల మంది క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి. క్రిప్టోకరెన్సీని నిషేధించాలని మొదటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బిల్లును కేంద్రం సిద్ధం చేసింది.
రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీని నిషేధించే బిల్లు రాబోతోందంటూ ప్రచారం జరగడంతో 24 గంటల్లో వాటి ధరలు భారీగా క్షీణించాయి. అనేక మంది భారతీయులు దేశీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల నుంచి ఇతర దేశాల ఎక్స్ఛేంజీలకు తమ పెట్టుబడులను బదిలీ చేశారు. దీంతోపాటు పొజిషన్లను లిక్విడేట్ చేస్తున్నారని ముద్రెక్స్ -ఎ- గ్లోబల్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ (Mudrx - A - Global) సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఎడుల్ పటేల్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bitcoin, Business, Cryptocurrency, Finance