Petrol and Diesel Price : మంచినీటి కన్నాచీప్‌గా మారిన ముడిచమురు...ధర ఎందుకు పడిపోయిందంటే...

బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 37 డాలర్లకు పడిపోయింది. ఈ భారీ క్షీణత తరువాత, ముడి చమురు మంచి నీటి కంటే చౌకగా మారింది.

news18-telugu
Updated: November 2, 2020, 5:05 PM IST
Petrol and Diesel Price : మంచినీటి కన్నాచీప్‌గా మారిన ముడిచమురు...ధర ఎందుకు పడిపోయిందంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనావైరస్ సంక్షోభం గురించి యూరోపియన్ దేశాల నుండి తీవ్ర ఆందోళన కారణంగా, మరోసారి ముడిచమురు ధరలు బాగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గే అవకాశం ఉన్నందున ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరిగిందని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అలాగే, ముడి చమురు ఉత్పత్తి మరియు ఎగుమతి చేసే దేశాలు ముడి సరఫరాను నిరంతరం పెంచుతున్నాయి. ఈ కారణంగా, బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 37 డాలర్లకు పడిపోయింది. ఈ భారీ క్షీణత తరువాత, ముడి చమురు మంచి నీటి కంటే చౌకగా మారింది. భారతదేశం తన ముడి చమురులో 83 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది, దీని కోసం ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి విలువ బలహీన పడితే మాత్రం ఈ దిగుమతి భారం పెంచుతుంది. అయితే భారాన్నీ భర్తీ చేయడానికి ప్రభుత్వం పన్ను రేట్లను ఎక్కువగా ఉంచుతుంది.

ముడి చమురు నీటి కంటే ఎలా చౌకగా మారింది -

ప్రస్తుతం, ముడి చమురు ధర బ్యారెల్ కు 37డాలర్లకు పతనం అయ్యింది. ఒక బ్యారెల్ 159 లీటర్లు కలిగి ఉంది. ఈ విధంగా, డాలర్ ధర 74 రూపాయలు. ఈ నేపథ్యంలో బ్యారెల్ ధర రూ .2733. అదే సమయంలో, మీరు లీటరుకు మార్చితే దాని ధర రూ .17కు దగ్గరగా ఉంటుంది, అదే సమయంలో మన దేశంలో బాటిల్ వాటర్ ధర రూ. 20 కి దగ్గరగా ఉంటుంది.

ముడి చమురు ధరలు ఎందుకు పడిపోతున్నాయి-
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, యూరప్ దేశాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. అదే సమయంలో, వ్యాపార కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా, పెట్రోల్ మరియు డీజిల్ డిమాండ్, వినియోగం వేగంగా సాగింది. ఇంతలో, ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడానికి సౌదీ అరేబియా, రష్యా, అమెరికా అంగీకరించలేదు. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని కొనసాగించింది. తరువాత, ముడి చమురుపై ఆధారపడిన సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ప్రారంభమైంది, ఇది ముడిచమురు ధరలను చాలా వేగంగా తగ్గించింది. తరువాత, ఒపెక్ ప్లస్ దేశాల ఒత్తిడిలో, చమురు ఉత్పత్తిని తగ్గించాయి.

ముడి చమురు పతనం భారత ఆర్థిక వ్యవస్థకు వరం-
ఏప్రిల్ నెలలో కూడా భారత ప్రభుత్వం ముడి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేసింది. కానీ అదే నిష్పత్తిలో పెట్రోల్-డీజిల్ ధరలో తగ్గుదల లేదు. ఇది ప్రభుత్వానికి రెండు రకాలుగా ప్రయోజనం కల్పించింది. మొదటిది కరెంట్ అకౌంట్ లోటు (CAD) తగ్గింది. రెండవది ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆర్థిక పరంగా, ఇది లాభదాయకం అనే చెప్పాలి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మెరుగుపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్రమంగా 77 నుంచి 74 కి మెరుగుపడింది.

ఇంకా చెప్పాలంటే డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూ. 4 పెరిగింది. దీనివల్ల ప్రభుత్వం దిగుమతి ఖర్చులను తగ్గించి, దేశ కరెంట్ అకౌంట్ లోటును తగ్గించింది. రూపాయి బలోపేతం చేయడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, జేమ్స్ & జ్యువెలరీ, ఎరువులు, రసాయనాల రంగాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఇది దిగుమతి ఖర్చును తగ్గిస్తుంది. అయితే, ఇది కొన్ని రంగాలకు కూడా హాని చేస్తుంది.
Published by: Krishna Adithya
First published: November 2, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading