CREDIT DEBIT CARD NEW RULE ENTER CARD NUMBER AND CVV EVERY TIME YOU PAY ONLINE FROM JULY UMG GH
Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డ్‌లకు కొత్త రూల్.. ఇకపై అది చేయకపోతే ప్రతిసారీ డీటేల్స్ ఎంటర్ చేయాల్సిందే..!
క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త రూల్స్.
డెబిట్ (Debit) కార్డ్, క్రెడిట్ (Credit) కార్డ్ టోకెనైజేషన్ ద్వారా ఆన్లైన్ (Online) ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితంగా మారుతాయి. ఎందుకంటే వ్యాపారుల వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్లో కస్టమర్ డేటా నిల్వ చేయలేరు. టోకెనైజ్ అయిన కార్డ్ లావాదేవీ సురక్షితంగా పరిగణించవచ్చు.
భారతదేశంలోని పేమెంట్ ఎకోసిస్టమ్ జూలై 1 నుంచి టోకెనైజేషన్ నియమాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లను టోకెనైజ్ చేయడానికి గడువును జనవరి 1 నుంచి జూలై 1 వరకు పొడిగించిన తర్వాత.. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ ఈ వివరాలను వెల్లడించింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ టోకెనైజేషన్ నియమం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తర్వాత, దేశీయ ఆన్లైన్ వ్యాపారులు తమ సర్వర్లలో కస్టమర్ డేటాను నిల్వ చేయడానికి అనుమతి ఉండదు. కస్టమర్ల ప్రైవసీ కాపాడేందుకే ఇలా చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్ అంటే ఏంటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల మేరకు.. వాస్తవ వివరాలను ప్రత్యామ్నాయ కోడ్‌తో రీప్లేస్ చేయడాన్ని టోకెన్ అంటారు. ఇది కార్డ్, టోకెన్ రిక్వెస్టర్ (అంటే కార్డ్ టోకెనైజేషన్ కోసం కస్టమర్ నుంచి అభ్యర్థనను స్వీకరించి, సంబంధిత టోకెన్‌ను జారీ చేయడానికి కార్డ్ నెట్‌వర్క్‌కు పంపుతుంది), డివైజ్‌కు (ఇకపై ఐడెంటిఫైడ్ డివైజ్‌గా పరిగణిస్తారు) ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ టోకెన్‌లో నేరుగా యాక్సెస్ చేయగల వ్యక్తిగత సమాచారం ఉండదని, చెల్లింపులను పూర్తి చేయడానికి ఇది అత్యంత సురక్షితమైన పద్ధతిగా మారుతూ ఉంటుంది అని భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ టోకెనైజేషన్ పూర్తయిన తర్వాత, పేమెంట్ అగ్రిగేటర్లు, వాలెట్లు, ఆన్లైన్ వ్యాపారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్, CVV, కార్డ్ గడువు తేదీ, ఇతర సున్నితమైన సమాచారంతో సహా కార్డ్ డేటాను నిల్వ చేయలేరు. బ్యాంకులు, ఆన్లైన్ వ్యాపారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను టోకెనైజ్ చేయడానికి ఇప్పటికే తమ కస్టమర్లకు హెచ్చరికలు పంపుతున్నారు.
టోకెనైజేషన్ జూలై 1లోపు చేయకుంటే ఏం జరుగుతుంది?
చెల్లింపులను సజావుగా నిర్వహించడానికి కార్డ్‌లను ‘టోకెనైజ్’ చేయడానికి ఆన్లైన్ వ్యాపారులు, బ్యాంకుల నుండి మీకు నోటిఫికేషన్లు అందుతాయి. అయితే ప్రక్రియ తప్పనిసరి కాదు. జూలై 1లోపు మీ కార్డ్‌ని టోకెనైజ్ చేయకుంటే, ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అన్ని కార్డ్ వివరాలను మళ్లీ నమోదు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఉన్న డేటాను సర్వర్ నుంచి తొలగిస్తారు.
కార్డ్ టోకెనైజేషన్ ప్రయోజనాలు ఏంటి?
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితంగా మారుతాయి. ఎందుకంటే వ్యాపారుల వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్లో కస్టమర్ డేటా నిల్వ చేయలేరు. టోకెనైజ్ అయిన కార్డ్ లావాదేవీ సురక్షితంగా పరిగణించవచ్చు. ఎందుకంటే లావాదేవీని నిర్వహించడానికి వాస్తవ కార్డ్ వివరాలు వ్యాపారులతో పంచుకోరని SBI వెబ్సైట్ పేర్కొంది.
16-అంకెల కార్డ్ నంబర్, కార్డ్‌లోని పేరు , దాని గడువు తేదీతో సహా కార్డ్ వివరాలు టోకెనైజ్ చేసిన కార్డ్‌లతో నమోదు చేయానల్సిన అవసరం లేనందున కస్టమర్ వేగంగా ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్‌కు అంగీకరించిన వారితో సహా కస్టమర్లకు అదనపు రక్షణ పొరగా CVV, OTP కొనసాగుతాయి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.