Credit Card | క్రెడిట్ కార్డు వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రివార్డు పాయింట్ల దగ్గరి నుంచి డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, ఈజీ ఈఎంఐ, వడ్డీ రహిత పీరియడ్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో నో కాస్ట్ ఈఎంఐ (EMI) ఫీచర్ ఉన్న క్రెడిట్ కార్డులను (Credit Cards) అధిక డిమాండ్ నెలకొందని బ్యాంక్ బజార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదిల్ శెట్టి తెలిపారు. ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే వారు పెరుగుతున్నారని పేర్కొన్నారు.
అమెరికాలో చూస్తే బీఎన్‌పీఎల్ అనేది ఒక ప్రత్యేకమైన పరిశ్రమగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. అక్కడ క్రెడిట్ కార్డులు ఇలాంటి ఆఫర్లు అందించవని తెలిపారు. అయితే భారత్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తున్నాయని తెలిపారు. క్రెడిట్ కార్డులపై బీఎన్‌పీఎల్ ఫీచర్2ను ఆఫర్ చేస్తున్నాయని పేర్కొన్నారు.
35 కిలోమీటర్ల మైలేజ్.. రేటు రూ.3.3 లక్షల నుంచి.. తక్కువ ధరలో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే!
ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డులోని బ్యాలెన్స్‌ను అలాగే ఉంచకుండా దాన్ని ఈఎంఐలోకి మార్చుకుంటున్నారని ఆయన తెలిపారు. మరీముఖ్యంగా కరోనా పాండమిక్‌లో ఇలా క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ వినియోగించుకొని దాన్ని ఈఎంఐలోకి మార్చుకోవడం ఎక్కువ అయ్యిందని వివరించారు. క్రెడిట్ కార్డు జారీ సంస్థలే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నాయని తెలిపారు.
ఎస్‌బీఐ ఆఫర్ల వర్షం.. రూ.25 వేల డిస్కౌంట్, క్షణాల్లో రుణం, జీరో చార్జీలు!
కన్సూమర్ ఫైనాన్స్ ప్రొవైడర్ హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వమించిన ఇటీవలి ఒక సర్వేను గమనిస్తే.. 50 శాతం మంది ఈఎంఐ కార్డులను కలిగి ఉండటానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. షాపింగ్ అవసరాలకు ఇలాంటి కార్డులు అనువుగా ఉంటాయని పేర్కొన్నారు. బ్యాంక్ బజాజ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుపై కూడా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందొచ్చని వివరించారు. అమెజాన్‌లో 100కు పైగా ప్రొడక్టులపై ఈ ప్రయోజనం ఉందని పేర్కొన్నారు.
కాగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో కొనుగోలు దారులు ఎలాంటి వడ్డీ లేకుండా ప్రొడక్టు ధరను వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. అదే ఈఎంఐ ఆప్షన్ అయితే వడ్డీ పడుతుంది. ఇక బ్యాంకులు ఈఎంఐ లేదా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లపై ప్రాసెసింజ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అదే బై నౌ పే లేటర్ ఆప్షన్ అయితే తక్కువ టెన్యూర్ ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐలో ఏడాది వరకు టెన్యూర్ లభిస్తుంది. అదే బై నౌ పే లేటర్‌లో అయితే మూడు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, EMI, Money